‘బలగం’ సినిమాను ఆస్కార్స్‌కు నామినేట్ చేయాలని పీపుల్ స్టార్ డిమాండ్

బలగం మూవీ ఫై పీపుల్ స్టార్ ఆర్.నారాయణమూర్తి మరోసారి ప్రశంసలు కురిపించారు. ‘బలగం’ సినిమాను ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుకు నామినేట్ చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతిని డైరెక్టర్స్ డేగా తెలుగు సినీ పరిశ్రమ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. దాసరి నారాయణరావు 76వ జయంతిని పురష్కరించుకుని తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో డైరెక్టర్స్ డేను నిర్వహించారు.

ఈ ఏడాది మంచి చిత్రాలు తీసిన దర్శక, నిర్మాతలను ఈ కార్యక్రమంలో సన్మానించారు. వాటిలో ‘బలగం’ సినిమా కూడా ఉంది. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ..ఈనాడు ఎక్కడ చూసినా, ఏ నాయకుడు చూసినా బలం బలగం.. ఇదీ మా బలం.. ఇదీ మా బలగం అంటున్నారు’ అని , విడిపోతున్న అన్నదమ్ములను ‘బలగం’ సినిమా కలుపుతోందని.. మానవ సంబంధాలంటే ఇవి అని, మట్టికి మనకు ఉన్న అనుబంధం ఇదీ అని సాటి చెబుతోందని ఆర్.నారాయణమూర్తి ప్రశంసించారు. ‘కలిసి ఉంటే కలదు సుఖం అని చెబుతూ, విడిపోయిన కుటుంబాలను కలుపుతూ ‘బలగం’ గొప్ప పాత్ర పోషించింది. నిజంగా బలగానికి సెల్యూట్. అలాంటి బలగం సినిమాను గుర్తించి, సన్మానించినందుకు సెల్యూట్’ అని నారాయణమూర్తి అన్నారు.

ఈరోజు మన తెలుగు జాతి గర్వించదగిన విధంగా నాటు నాటు పాటకు ఆస్కార్ వచ్చింది. అందుకని ‘బలగం’ సినిమాను ఆస్కార్‌కు రికమండ్ చేయాలి. నవంబర్ 15 నాటికి ఆస్కార్ అవార్డు నామినేషన్స్ అయిపోతాయి. కాబట్టి బలగంను ఆస్కార్‌కు నామినేట్ చేసి తన తెలుగు జాతి సినిమా బలాన్ని ప్రపంచానికి చూపించాలి’ అని నారాయణమూర్తి అన్నారు.