ఇక్కడ జరుగుతున్న చర్చలు ఆఫ్ఘన్ ప్రజలకు ఉపయోగపడుతాయి
ఆఫ్ఘనిస్థాన్‌పై 7 దేశాల భద్రతా సలహాదారులతో దోవల్ చర్చలు
India’s Ajit Doval hosts NSA-level summit on Afghan situation; 7 nations in attendance
న్యూఢిల్లీ: నేడు జాతీయ భద్రతాసలహాదారు అజిత్ ధోవల్ నేతృత్వంలో ఢిల్లీలో ప్రాంతీయ భద్రతా అంశంపై చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అజిత్ ధోవల్ మాట్లాడుతూ.. ఆఫ్ఘనిస్తాన్‌లో జరుగుతున్న పరిణామానలు చాలా సునిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఆఫ్ఘన్‌లో జరుగుతున్న పరిణామాలు ఆ దేశానికే కాకుండా, పొరుగు దేశాలకు, ఈ ప్రాంతానికి కీలకంగా మారనున్నట్లు ఆయన చెప్పారు.
ఆఫ్ఘన్ అంశంపై ప్రాంతీయ దేశాల మధ్య పరస్పర చర్చలు, సహకారం అవసరమన్నారు. ఇక్కడ జరుగుతున్న చర్చలు ఆఫ్ఘన్ ప్రజలకు ఉపయోగపడుతాయని ఆయన నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఆఫ్ఘనిస్తాన్ గురించి వివిధ దేశాలకు చెందిన భద్రతా సలహాదారుల ఆ సమావేశాల్లో చర్చిస్తున్నారు. రష్యా, ఇరాన్‌తో పాటు అయిదు సెంట్రల్ ఏషియా దేశాలు ఈ సమావేశాలకు హాజరవుతున్నాయి. కజకిస్తాన్, కిర్గిస్తాన్, తజకిస్తాన్, తుర్కమిస్తాన్, ఉజ్బెకిస్తాన్ దేశాలకు చెందిన భద్రతా సలహాదారులు కూడా ఈ సమావేశాలకు హాజరయ్యారు.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/