పుష్ప నుండి అనసూయ లుక్ రిలీజ్ ..గుర్తుపట్టడం కష్టమే

పుష్ప మూవీ నుండి అసలు సిసలైన ఊర మాస్ లుక్ వచ్చేసింది. రంగస్థలం మూవీ లో రంగమ్మత్త గా యావత్ ప్రేక్షకులను అలరించిన అనసూయ..పుష్ప లో దక్షాయనిగా కనిపించబోతుంది. ఈ తరుణంలో ఈమె తాలూకా లుక్ ను రిలీజ్ చేసి ఆకట్టుకున్నారు చిత్ర యూనిట్. ఇందులో ఊర మాస్​గా ఉన్న ఆమె లుక్​ సినిమాపై మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ఇక రీసెంట్ గా ‘మంగళం శ్రీను’ పాత్రలో సునీల్ ను పరిచయం చేస్తూ ఆయన లుక్ ను రివీల్ చేశారు. సునీల్ ను ఆ తరహా లుక్ తో ఊహించని నెటిజన్లు షాక్ అయ్యారు. సునీల్ పాత్ర ఎలా ఉండనుందా అనే ఆసక్తి అందరిలోను పెరిగిపోయింది. ఇక ఇప్పుడు అనసూయ లుక్ విడుదల చేసి ఇంకాస్త ఆసక్తి పెంచారు.

ఈ పాన్ ఇండియా చిత్రానికి సుకుమార్ డైరెక్ట్ చేస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తోంది. ఇందులో బన్నీ పుష్పరాజ్‌ అనే ఎర్రచందనం స్మగ్లర్‌ పాత్రలో కనిపించనున్నారు. ఆయన ప్రేయసి శ్రీవల్లిగా రష్మిక కనిపిస్తుంది. ప్రతినాయకుడిగా మలయాళీ నటుడు ఫహద్‌ ఫాజిల్‌ నటిస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. ‘పుష్ప ది రైజ్‌’ పేరుతో మొదటి భాగాన్ని డిసెంబర్‌ 17న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.