బిగ్ బాస్ సీజన్ 5 : పదో వారం ఎవరెవరు నామినేట్ అయ్యారంటే

బిగ్ బాస్ సీజన్ 5 సక్సెస్ ఫుల్ గా కొనసాగుతుంది. తొమ్మిదో వారానికి గాను విశ్వ ఎలిమినేట్ అవ్వగా..పదో వారం ఎలిమినేట్ నామినేషన్ పక్రియ కొత్తగా సాగినట్లు ప్రోమో చూస్తే అర్ధమవుతుంది. సాధారణంగా జరిగే నామినేషన్స్ ప్రక్రియ కాకుండా ఈసారి కెప్టెన్ అనీ మాస్టర్ ను నలుగురు ఇంటి సభ్యులను ఎంపిక చేసి జైలుకి పంపాలని బిగ్ బాస్ ఆదేశించారు. దీంతో అనీ మాస్టర్ ..కాజల్, వీజే సన్నీ, మానస్, షణ్ముఖ్ జస్వంత్‌ను అనీ మాస్టర్ జైల్లో పెట్టింది. ఆ తర్వాత మిగతా సభ్యులు హౌస్ లో ఉన్న జైలు తాళం ద్వారా..జైలు లో ఉన్న సభ్యులను బయటకు పంపే అవకాశం ఇచ్చారు బిగ్ బాస్. ఆలా తాళం దక్కించుకున్న సభ్యులు వారిని నచ్చిన వారిని జైలు నుండి బయటకు తీసుకొచ్చారు.

ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు ఈ వారం ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి అవకాశం ఉన్న ఇంటి సభ్యుల్లో ఆర్జే కాజల్, సిరి హన్మంతు, యాంకర్ రవి, షణ్ముఖ్ జస్వంత్, మానస్ ఉన్నారు. దీంతో ఈ వారం కూడా ఎలిమినేషన్ ప్రక్రియ ఆసక్తిగా మారింది. టాప్ కంటెస్టెంట్లలో ఎవరిపై ఎలిమినేషన్ వేటు పడుతుందో వేచి చూడాల్సిందే. ఇక తొమ్మిదో వారం నామినేషన్స్ లో ఆట పరంగా తనకన్నా వీక్ కంటెస్టంట్స్ ఉండగా తక్కువ ఓట్లు రావడంతో విశ్వ ఎలిమినేట్ అయ్యాడు. 9 వారాలకు గాను బిగ్ బాస్ నుండి విశ్వ ఎంత రెమ్యునరేషన్ తీసుకుని ఉంటాడు అంటే.. దాదాపు 22 లక్షల దాకా అని అంటున్నారు. వారానికి రెండు, రెండున్నర లక్షల రెమ్యునరేషన్ తో డీల్ కుదుర్చుకున్న విశ్వ.. 9 వారాలకు మొత్తగాం 22 లక్షల దాకా దక్కించుకున్నాడని తెలుస్తుంది.