నావల్ యాంటీ షిప్ మిస్సైల్‌ను పరీక్షించిన నేవీ

న్యూఢిల్లీ: ఈరోజు భారతీయ నౌకాదళం ట్రయల్స్‌లో భాగంగా యాంటీ షిప్ మిస్సైల్ ను పరీక్షించింది. భారతీయ నేవీతో పాటు డీఆర్డీవో ఈ పరీక్షలో పాల్గొన్నది. నావల్ యాంటీ షిప్ మిస్సైల్‌ను స్వదేశీ పరిజ్ఞానంతో డెవలప్ చేశారు. సీ కింగ్ 42బీ హెలికాప్టర్ నుంచి దీన్ని పరీక్షించారు. మిస్సైల్ టెక్నాలజీలో సంపూర్ణ ఆధిపత్యాన్ని, స్వయం సమృద్ధిని సాధించేందుకు భారతీయ నేవీ ప్రయత్నిస్తోంది. యాంటీ షిప్ మిస్సైల్.. స్వల్ప శ్రేణి దూరంలో ఉన్న లక్ష్యాలను చేధించగలదు.