అమలాపురం ఘటనఫై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందన

కోససీమ జిల్లా పేరును అంబేద్కర్ జిల్లాగా మార్చడం ఫై అమలాపురంలో కోనసీమ సాధన సమితి ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఈ ఆందోలన వెనుక టీడీపీ, జనసేన పార్టీల హస్తం ఉందంటూ వైసీపీ నేతలను ఆరోపిస్తుండగా..వాటిని ఖండించారు పవన్ కళ్యాణ్. ఉద్రిక్త పరిస్థితులకు కారణం ఎవరనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని స్పష్టం చేశారు. హోంమంత్రి ప్రకటనలో జనసేన పేరు ప్రస్తావించడాన్ని ఖండిస్తున్నానని తెలిపారు. ప్రభుత్వ లోపాలు, వైసీపీ వైఫల్యాలను జనసేనపై రుద్దకండి అంటూ హోంమంత్రికి హితవు పలికారు.
శాంతియుత పరిస్థితుల కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు. అంబేడ్కర్ పేరును వివాదాలకు కేంద్ర బిందువుగా మార్చడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మహనీయుడి పేరును వివాదాల్లోకి తెచ్చినందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. అమలాపురంలో శాంతిభద్రతలు నెలకొల్పడంలో ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు. పాలనా లోపాలను కప్పిపుచ్చుకోవడానికి సమస్యలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. పాలకుల వైఫల్యాలను పార్టీలకు ఆపాదిస్తున్నారని మండిపడ్డారు.