చైనాపై డబ్ల్యూహెచ్ఓ పొగడ్తలు

వుహాన్ ను చూసి ప్రతిదేశం నేర్చుకోవాలని సూచన

Tedros Adhanom
Tedros Adhanom

బీజింగ్‌: చైనాలోని వూహాన్‌ వైరాలజీ ల్యాబ్‌లో నుండే కరోనా వైరస్‌ వ్యాప్తి చెందిందని అమెరికా అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) స్పందించింది. కరోనా ప్రయోగశాలలో పుట్టిన వైరస్ కాదని, అది సహజసిద్ధంగా వాతావరణంలోనే జన్మించిందని డబ్ల్యూహెచ్ఓ స్పష్టం చేసింది. అంతేగాకుండా, చైనాపై పొగడ్తల జల్లు కురిపించింది. కరోనా వైరస్ ను చైనా అద్భుతంగా కట్టడి చేసిందని, ప్రతి దేశం వుహాన్ ను చూసి నేర్చుకోవాలని, కొద్ది వ్యవధిలోనే వుహాన్ లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని వివరించింది. అయితే కరోనా వైరస్ కు ఆవాసంగా నిలుస్తున్న జీవి ఏంటన్నది తెలుసుకునేందుకు పరిశోధనలు సాగుతున్నాయని వివరించింది. కరోనా వైరస్ ఏ జీవి ద్వారా మానవులకు సంక్రమించిందన్నది తెలిస్తే, వ్యాప్తి నివారణకు కీలక ముందడుగు పడినట్టేనని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/