ముగ్గురు చైనా పౌరులను రక్షించిన భారత సైన్యం

సిక్కిం బోర్డర్ దాటిన చైనీయలు

ముగ్గురు చైనా పౌరులను రక్షించిన భారత సైన్యం
Indian Army Rescues 3 Chinese Citizens

గ్యాంగ్‌టక్‌: దారి తప్పిన ముగ్గురు చైనా పౌరుల‌ను భార‌త సైన్యం ర‌క్షించింది. ఉత్తర సిక్కిం ప్రాంతంలో సముద్ర మట్టానికి దాదాపు 17,500 అడుగుల ఎత్తైన ప్రాంతంలో కారులో ప్రయాణిస్తున్న వీరు ముగ్గూరు దారి తప్పి భారత భూభాగంలోకి ప్రవేశించారు. అయితే వీరి బాధను అర్థం చేసుకున్న సైనికులు వారిని ఆదరించారు. ఆహారాన్ని అందించడమే కాకుండా, శీతల వాతావరణం నుంచి రక్షించుకునేందుకు దుస్తులను కూడా ఇచ్చారు. అంతేేకాదు వారికి ఆక్సిజన్ ను కూడా అందించారు. ఈ విషయాన్ని భారత సైన్యం అధికారికంగా ప్రకటించింది. అనంతరం వారు తిరిగి వెళ్లడానికి జవాన్లు సహకరించారు. ఈ సందర్భంగా మన సైన్యానికి చైనీయులు కృతజ్ఞతలు తెలిపారు. ఇదే సమయంలో అరుణాచల్ ప్రదేశ్ లో మన దేశానికి చెందిన ఐదుగురిని చైనా సైనికులు అపహరించడం గమనార్హం. భారత బలగాలు రక్షించాయి. వారిలో ఒక మహిళ కూడా ఉండటం గమనార్హం.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/