రైతులను క‌ష్టాల పాలు చేసేలా నిర్ణ‌యాలు వ‌ద్దు

ఉచిత విద్యుత్ రైతులు పోరాడి సాధించుకున్న హక్కు

రైతులను క‌ష్టాల పాలు చేసేలా నిర్ణ‌యాలు వ‌ద్దు
chandrababu-press-meet

అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు ఈరోజు మీడియాతో మాట్లాడుతూ.. ‌ఉచిత విద్యుత్ అనేది‌ రైతులు పోరాడి సాధించుకున్న హక్కు అని ఆయన చెప్పుకొచ్చారు. దాన్ని యథాతథంగా పునరుద్ధరించాలని, వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వ నిర్ణయాలు రైతులను క‌ష్టాల పాలు చేసేలా ఉన్నాయ‌ని చంద్ర‌బాబు నాయుడు విమ‌ర్శించారు. వ్యవసాయ విద్యుత్తుకు నగదు బదిలీ పథకం పేరిట మీటర్లు బిగిస్తున్నారని, ప్రభుత్వం జీవో 22ను ఉపసంహరించుకోవాలని ఆయ‌న చెప్పారు. రాయ‌ల‌సీమ, మెట్ట ప్రాంతాల‌ రైతుల మనోభావాలు దెబ్బతీసేలా ప్ర‌భుత్వ నిర్ణయం ఉంద‌ని చంద్ర‌బాబు నాయుడు తెలిపారు. అప్పులు చేయడమే ప్రాధాన్యతగా వైఎస్‌ఆర్‌సిపి స‌ర్కారు చ‌ర్య‌లు ఉన్నాయ‌ని చెప్పారు. ప్రజలపై గంటకు రూ.9 కోట్ల అప్పు మోపుతున్నారని ఆయ‌న తెలిపారు. జగన్ కు ఏపి‌‌ బానిస కాదని ఆయ‌న వ్యాఖ్యానించారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/