హైదరాబాద్‌ మెట్రో ప్రయాణికులకు మార్గదర్శకాలు

కరోనా లక్షణాలు లేనివారికే అనుమతి..మెట్రో ఎండీ

హైదరాబాద్‌ మెట్రో ప్రయాణికులకు మార్గదర్శకాలు
Hyderabad Metro Rail MD NVS Reddy

హైదరాబాద్‌: ఈ నెల 7నుంచి హైదరాబాద్‌ మెట్రో సర్వీసులు పున: ప్రారంభం అవుతున్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో హైదరాబాద్‌ మెట్రో ఎండీ ఎన్‌ వీ ఎస్‌ రెడ్డి ప్రయాణికులు పాటించాల్సిన మార్గదర్శకాల గురించి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘అన్‌లాక్‌ 4కు అనుగుణంగా ఈ నెల 7 నుంచి మెట్రో సర్వీసులు పున: ప్రారంభిస్తున్నాం. అన్ని కరోనా జాగ్రత్తలుతీసుకుంటున్నాం. ఫిజికల్ డిస్టెన్స్ తప్పనిసరి. మార్కింగ్‌కు తగ్గట్టుగా ప్రయాణీకులు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. నిత్యం స్టేషన్ పరిసరాలను శానిటైజ్ చేస్తాం. నగదు రహిత లావాదేవీలు జరుపుతాం. ప్రయాణికులు ఆన్‌లైన్, స్మార్ట్ కార్డ్, క్యూ ఆర్ కోడ్ యూజ్ చేయాలి. ప్రతి 5 నిముషాలకు ఒక ట్రైన్ అందుబాటులో ఉంటుంది.

రద్దీని బట్టి వేళల్లో మార్పులు చేర్పులు ఉంటాయి. ఫేస్ మాస్క్ తప్పనిసరి. లేనివారు స్టేషన్‌లో కొనుక్కోవాలి. ప్రతి ప్రయాణీకుడిని థర్మల్ స్క్రీనింగ్ చేస్తాం. నార్మల్ టెంపరేచర్ ఉంటేనే అనుమతిస్తాం. హ్యాండ్ శానిటైజర్ నిత్యం అందుబాటులో ఉంటుందిగ అని తెలిపారు మెటల్ ఐటమ్స్ లేకుండా మినిమం బ్యాగేజ్‌తో ట్రైన్‌లోకి రావాలి. 75% ఫ్రెష్ ఎయిర్ ట్రైన్‌లో అందుబాటులో ఉంటుంది. అక్కడక్కడ టెర్మినల్స్ వద్ద ట్రైన్ డోర్లు కొద్దిసేపు తెరిచి ఉంచుతాము. ప్రతి స్టేషన్‌లో ఐసోలేషన్ రూమ్‌లు ఏర్పాటు చేశాంగ అని మెట్రోరైల్ ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి మీడియాకు వెల్లడించారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/