అత్యధిక కరోనా కేసులు నమోదు జాబితాలో భారత్ నాలుగో స్థానం
2, 97, 535 కరోనా కేసులు

New Delhi: భారత్ లో కరోనా అనూహ్య రీతిలో వ్యాప్తి చెందుతోంది.
ప్రపంచంలో అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో ఉంది.
అమెరికా 20లక్షలకు మించి కరోనా కేసులతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, రెండో స్థానంలో బ్రెజిల్ ఉంది. ఆ దేశంలో ఏడులక్షల 72వేల కరోనా కేసులు నమోదయ్యాయి.
మూడో స్థానంలో రష్యా నిలిచింది. ఆ దేశంలో 5లక్షలకు చేరువలో కరోనా కేసులు ఉన్నాయి.
భారత్ 2, 97వేల 535 కరోనా కేసులతో నాలుగో స్థానంలో ఉంది. బ్రిటన్ 5వ స్థానంలో నిలిచింది.
తాజా కెరీర్ సమాచారం కోసం : https://www.vaartha.com/specials/career/