జూన్ 1న ‘ఇండియా’ కూటమి నేతల సమావేశం

లోక్ సభ ఎన్నికల ఫలితాలు జూన్ 4న వెల్లడికానుండగా, అంతకుముందే జూన్ 1న ఇండియా కూటమి నేతలు సమావేశం కానున్నారట. ఈ సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణపై చర్చిస్తారని సమాచారం. మరోవైపు అదే రోజున ఏడో విడత పోలింగ్ జరగనుంది. ఈ భేటీకి ఢిల్లీ సీఎం కేజీవాల్ సైతం హాజరుకానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా ఆయన ఆ తర్వాతి రోజు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో భాగంగా కోర్టులో సరెండర్ కావాల్సి ఉంది.