రేపటి నుంచి తెలంగాణ ఎంసెట్

కన్వీనర్ గోవర్ధన్ వెల్లడి

TS Eamcet from Aug 4th
Career

Hyderabad: తెలంగాణలో రాష్ట్రంలో ఈ నెల 4వ తేదీ నుంచి ఎంసెట్ పరీక్షలు ప్రారంభమవుతాయని కన్వీనర్ గోవర్ధన్ తెలిపారు. ఈమేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని వెల్లడించారు. ఎంసెట్‌కు మొత్తం విద్యార్థులు 2,51,132 మంది దరఖాస్తు చేసుకున్నారని, ఇంజనీరింగ్ ఎంట్రన్స్‌ విద్యార్థులు 1,64,678 మంది, మెడికల్ ఎంట్రన్స్‌ రాస్తున్న విద్యార్థులు 86,454 మంది రాయనున్నారు ఎంసెట్ కోసం తెలంగాణలో 82 సెంటర్లు, ఏపీలో 23 సెంటర్లు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఆగస్ట్ 4,5,6 తేదీలలో ఇంజనీరింగ్ పరీక్షలు నిర్వహిస్తామని గోవర్ధన్ చెప్పారు. ఆగస్ట్ 9,10 తేదీల్లో వ్యవసాయ, మెడికల్ ఎంట్రన్స్ పరీక్ష నిర్వహిస్తామన్నారు. ఉదయం 9 నుంచి 12 వరకు ఒక సెషన్, మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు రెండో సెషన్ నిర్వహిస్తామని తెలిపారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/