గుంటూరు జిల్లాలో ‘సుప్రీమ్’ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ పర్యటన

పొన్నూరు లోని శ్రీ సహస్ర లింగేశ్వర స్వామి , శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయాల్లో సందర్శన

Chief Justice of India Justice NV Ramana and his wife visit Sri Sahasra Lingeshwara Swamy and Sri Veeranjaneya Swamy Warla Temple in Ponnur-1
Chief-Justice-of-India-Justice-NV-Ramana-and-his-wife-visit-Sri-Sahasra-Lingeshwara-Swamy-and-Sri-Veeranjaneya-Swamy-Warla-Temple-in-Ponnur

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకట రమణ దంపతులు శుక్రవారం రాత్రి పొన్నూరు లోని శ్రీ సహస్ర లింగేశ్వర స్వామి మరియు శ్రీ వీరాంజనేయ స్వామి వార్ల దేవస్థానంలో శ్రీ వీరాంజనేయ స్వామి వారిని దర్శించుకున్నారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకట రమణ దంపతులతో పాటు తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ దంపతులు, రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి మేకతోటి సుచరిత, దేవాదాయ శాఖ కమిషనర్హ రి జవహర్ లాల్, రాష్ట్ర హై కోర్ట్ న్యాయమూర్తులు వున్నారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకట రమణ దంపతులకు వేద పండితులు ఆలయ మర్యాదలు, వేద మంత్రోచ్ఛారణలు, మేళతాళాలతో దేవాలయంలోకి ఘనస్వాగతం పలికారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకట రమణ, తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ దంపతులు శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవాలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ పూజారులు వీరికి ఆశీర్వచనాలు చేసి తీర్ధప్రసాదాలు అందించారు.

Chief-Justice-of-India-Justice-NV-Ramana-and-his-wife-visit-Sri-Sahasra-Lingeshwara-Swamy-and-Sri-Veeranjaneya-Swamy-Warla-Temple-in-Ponnur

రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి మేకతోటి సుచరిత, రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ హరి జవహర్ లాల్ వీరికి ఆలయ
మర్యాదలతో సన్మానించి శ్రీ వీరాంజనేయ స్వామి చిత్రపటాన్ని అందించారు. తొలుత శ్రీ సహస్ర లింగేశ్వర స్వామి మరియు శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంవద్దకు వచ్చిన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకట రమణ దంపతులకు రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి మేకతోటి సుచరిత, రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ హరి జవహర్ లాల్, జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, ఇన్ చార్జ్ జిల్లా జడ్జీ అహ్మద్
బాషా, రూరల్ జిల్లా ఎస్పీ విశాల్ గున్నీ, సంయుక్త కలెక్టర్ (రెవెన్యూ, రైతు భరోసా) ఏ.ఎస్.దినేష్ కుమార్ పుష్పగుచ్చాలు అందించి ఘన స్వాగతం పలికారు.

Chief-Justice-of-India-Justice-NV-Ramana-and-his-wife-visit-Sri-Sahasra-Lingeshwara-Swamy-and-Sri-Veeranjaneya-Swamy-Warla-Temple-in-Ponnur

ఈ కార్యక్రమంలో లేబర్ కోర్ట్ జడ్జీ జునైల్ అహ్మద్, బాపట్ల సీనియర్ సివిల్ జడ్జీ వేంకటేశ్వర నాయక్, పొన్నూరు ప్రిన్సిపల్ జూనియర్ జడ్జీ యం. సత్యకుమారి, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ మహేశ్వర రెడ్డి, దేవస్థానం ఈ.ఓ తురుమెళ్ళ శ్రీనివాస రావు, ఛైర్మన్ నాగసూర్య ప్రతాప్ కుమార్, న్యాయమూర్తులు, జ్యుడీషియల్ అధికారులు పాల్గొన్నారు. దేవాలయం వద్ద భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకట రమణ గారిని పలు సేవాసంస్థల ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలసి ఘనంగా సన్మానించారు.

తెలంగాణ వార్తల కోసం: https://www.vaartha.com/telangana/