పేదరికంలేని దేశంగా భారత్
ప్రభుత్వ తీసుకున్న చర్యలతో కోట్లాదిమందికి విముక్తి

ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం. విస్తీర్ణంలో ఏడవ స్థానం, జనాభాలో రెండవ స్థానంలో ఉంది.
అనేకానేక సమస్యలతో కొట్టుమిట్టాడుతూ, పకడ్బంది ప్రణాళికలు రూపొందించి దేశం ముందుకు వెళు తున్నది.
దేశాన్ని ప్రధానంగా నిరుద్యోగం, పేదరికం, పోషకా హారం లేమి పట్టి పీడిస్తున్నవి. వీటిని నివారించడానికి పంచవర్ష ప్రణాళికలలో కూడా నిధులు కేటాయించారు.
ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న కాలంలో ‘గరీబీ హఠావో నినాదం జనాలలో బాగా దూసుకుపోయింది. పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం ఆ దిశలో చర్యలుకూడా తీసుకుంది.
ఈ విషయంలో కొంత వరకు ఉన్నతి సాధించినా ఇంకా పేదరికం రోజురోజుకు పెరగడం శోచనీయం. ప్రస్తుతం ప్రభుత్వం కూడా పేదరికం రూపు మాప టానికి తగిన చర్యలు తీసుకోవడం ముదావహం.
ఇటీవల కాలంలో ఐక్యరాజ్యసమితి నివేదికలో భారత్‌లో చాలావరకు పేదరికం మరుగునపడిందని తెలుపుతోంది.
ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం 2005-2006 నుంచి 2015-2016 మధ్య కాలంలో ప్రపంచ వ్యాప్తంగా తగ్గిన పేదరికం గురించి నివేదిక విడుదల చేసింది.
విశ్వవ్యాప్తంగా చూసుకుంటే దాదాపు 27 కోట్లకుపైగా పేదరికం నుంచి విముక్తి పొందారని తెలుస్తోంది.
ఈ లెక్కల ప్రకారం భారత్‌లో అత్యధిక సంఖ్యలో చాలావరకు పేదరికం నుంచి బయటపడినట్లు తెలుస్తుంది.
పేదరికంపై ఐక్య రాజ్యసమితిలోని యుఎన్‌డిపి (అభివృద్ధి కార్యక్రమాల సంస్థ) ఓ.పి.హెచ్.ఐతో కలిసి పేదరికంపై సమగ్ర అధ్యయనం చేసింది. దాదాపుగా 75దేశాలలో ఈసర్వే జరిపారు.
అందులో 65 దేశాలు 2000 సంవత్సరం నుంచి 2019 సంవత్సరం మధ్యకాలంలో ఈ విపత్కర, సంక్లిష్ట పరిస్థితి నుంచి విముక్తి పొందాయని ఓ నిర్ధారణ. పేదరికం గురించి అనేక అంశాలు పరిగణనలోకి తీసుకున్నారు.
పనిచేసే ప్రదేశాలలో సరైన సౌకర్యాలు లేకపోవడం, కలుషిత వాతావరణం, అతి ఇరకైన జనాల మధ్య మురికి ప్రదేశాలు అక్కడ వారుపడే పాట్లు ఇత్యాది వివరాలు ఎప్పటికప్పుడు తీసుకుని లెక్క కట్టారు.
ఈ దిశలో కొన్ని దేశాలుచాలా వరకు పేదరికం నుండి విముక్తి కలిగినట్లు భోగట్టా. ప్రత్యేకించి అభివృద్ధి చెందుతున్న భారత్ లాంటి దేశాలలో ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా కొన్ని కోట్ల మందికి విముక్తి కలిగిందని తెలుస్తోంది.
అయితే ప్రస్తుతం కరోనా వ్యాప్తితో పేదరిక నిర్మూలనకు కార్యక్రమాలు ఎంతవరకు సఫలీకృతం అవుతాయోననే సంశయం ఉందని ఓ అధ్యయనం లో ఉటంకించారు.
పది దేశాలలో ఇప్పటికే 70 శాతం మంది పిల్లలకు టీకాలు వేయని పరిస్థితి ఉంది.
భారత్‌తోసహా బంగ్లాదేశ్ పాకిస్థాన్, నైజీరియా దేశాలలో 40 శాతం మందికి అత్యంత ముఖ్యమైన డి.టి.పి మూడు టీకాలు వేయలేని స్థితి లో ఉన్నాయని ఐక్యరాజ్యసమితి అధ్యయనంలో వెల్లడైంది.
ఏదిఏమైనా ప్రస్తుత పరిస్థితుల్లో కరోనాకాలంలో పేదలు అతి కష్టంపై జీవనం సాగిస్తున్నారు. ఎక్కడా పని దొరకని పరిస్థితి నెలకొంది. పేదల బతుకులు చిధ్రమైపోయాయి.
ఎక్కడికని ఎంత మందికని ప్రభుత్వం సహాయ చేస్తుందని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసమే అనే విషయం మనం మరువకూడదు. ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమానికి, చర్యకు పౌరుల సహకారం ఉంటే పేదరికం పారద్రోలవచ్చు.
తద్వారా దేశంలో పేదరికం లేని దేశంగా భారత్‌ను తీర్చిదిద్దడానికి మన మనందరం శాయశక్తులా, ఇతో ధికంగా ప్రభుత్వానికి సహాయసహకారాలు అందించాలి.
చేతనైన సాయం వ్యక్తిగతంగా కూడాచేయాలి.అప్పుడే భారత్‌ను ప్రపంచ పటంలో పేదరికం లేని దేశంగా మనం చూడొచ్చు.
- కనుమ ఎల్లారెడ్డి
తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/