ధూమపానాన్ని నియంత్రించలేమా?

పట్టించుకోని పాలకులు..రోగాల బారిన ప్రజలు

Can’t control smoking?

కేంద్రప్రభుత్వం జాతీయస్థాయిలో దృష్టి సారించవలసిన అత్యంత ముఖ్యమైన విషయాల్లో ధూమపానం నియంత్రించలేమా?

పేరుకు బహిరంగ ధూమపానం నిషేధం అని చట్టం చేస్తారు. అమలును అటకెక్కిస్తారు. ఇంతకుముందు సిగరెట్లు, చుట్టలు, బీడీలు, గుట్కాలు లాంటివి ఒక్క బడ్డీకొట్లల్లో మాత్రమే దొరికేవి.

కానీ ప్రస్తుతం ప్రతి టీస్టాల్‌లోనూ, కిరాణా షాపుల్లోనూ విరివిగా అందుబాటులోకి రావడంతో టీనేజీ పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు బహిరంగంగానే ధూమపానం చేయడం ఎక్కువయింది.

మహిళలు, స్కూలు పిల్లలు, దేవాలయాలు ఉన్న సమూహాల్లో కూడా ధూమపానం వల్ల అనేక మంది ఆ పొగ పీల్చి అకారణంగా రోగాల పాలవ్ఞతున్నారు.

విదేశీ సిగరెట్ల రవాణాను, అమ్మకాన్ని నిలిపివేసి ఎందరిమీదనో కేసులు పెడుతున్నా దొడ్డిదారిన మళ్లీ దుకాణాలకు చేరుకుం టున్నాయి.

మనదేశంలో ఆంధ్రప్రదేశ్‌తోపాటు కొన్ని రాష్ట్రాలు మద్యపానం నియంత్రణ దిశగా అడుగులు వేస్తున్నట్లే ఈ విషయంపై కూడా సీరియస్‌గా ఆలోచించాలి.

ఆకర్షణీయంగా తయారవ్ఞతున్న పెట్టెలు, అందులో సిగరెట్లు ఎంత ఖరీదైనా కొందరికి అలవాటైతే మరి కొందరికి ఫ్యాషన్‌గా మారింది. పది మంది నిలబడ్డచోట కనీసం ఐదారు మందిపైగా సిగరెట్లు కాలుస్తూ, కనీస మర్యాద కూడా పాటించడం లేదు.

కర్ణాటక, ఒడిశా, చెన్నై రాష్ట్రాల్లోనూ, తెలుగు రాష్ట్రాల్లోనూ విదేశీ సిగరెట్లు పట్టుకుంటున్నా కేసులు పెడుతున్నా నియంత్రణలోకి రావడం లేదు.

సిగరెట్లలో గంజాయి కూరుకొని మరీ తాగేవాళ్లలో కొంత మంది విద్యార్థులు కూడా ఉండటం దౌర్భాగ్యం.

చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్న అధికార వర్గాలు దీనికంతటికీ బాధ్యత వహించాలి. ప్రపంచ వ్యాప్తంగా వంద కోట్లు దాటిన ధూమపాన ప్రియులు మూడొంతులు పైగా దీని కార ణంగానే మర ణిస్తూ కుటుంబా లకు శోకాన్ని మిగిలించి వారిని రోడ్డున పడేస్తున్నారు.

మరి కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో తమలపాకుతో పాటుపొగాకు కూడా బుగ్గన పెట్టుకోవడం అలవాటు. దంత ధావనం సరిగ్గా లేక దంతాల చిగుళ్లు సలుపుతుంటే చుట్టకాల్చి నిప్పువైపు లోపల పెట్టుకొని వేడికి ఉపశమనం పొందుతూ నోటికి సంబంధించిన వ్యాధులకు కారణమవ్ఞతున్నారు.

బీడీ కట్టల మీద పుర్రె బొమ్మలు వేసినా, సిగరెట్‌ పెట్టెలమీద కేన్సర్‌ బొమ్మలు వేసినా,హెచ్చరికలు రాసినా దున్నపోతుమీదవానపడ్డట్లే.

మన ఉత్పత్తులతో పాటు విదేశీ సిగరెట్లపై పెరిగిన మోజు లగ్జరీగా మారి అనేక ఉన్నత కుటుంబాల్లో మహిళలు కూడా ధూమపానానికి అలవాటుపడటంతో కుటుంబ వ్యవస్థలే అనారోగ్యంతో కునారిల్లుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లోను, మిగతా కొన్నిరాష్ట్రాల్లోను మద్య నియంత్రణకోసం ఎలాంటి ప్రయత్నా లు చేస్తున్నారో దేశవ్యా ప్తంగా జాతీయస్థాయిలో ధూమపాన నియంత్రణకు అలాగే కృషి చేయాలి.

దురదృష్టవశాత్తు చిన్న చిన్న విషయాలకే ప్రభుత్వ విధానాలపై నెలలతరబడి ధర్నా లు, నిరాహార దీక్షలు చేసే అనేకమంది నాయకులు, ప్రజలు మద్యపానం,ధూమపానం నియంత్రణ లాంటి మంచి పనుల కోసం మాత్రం తనవంతుగా ఉద్యమించకపోగా సరైన బ్రాండ్లు మార్కెట్‌లో లేవని బాధపడతారు.

నలుగురి మధ్యలో పొగతాగ డం నేరంగా కాకుండా పొగ తాగకుండా ఉండడం సామాజిక బాధ్యతగా ప్రజలు స్వీకరించ నంతకాలం కారుమేఘాలై కమ్ము కుంటూ కేన్సర్‌ లాంటి వ్యాధు ల్ని ప్రపంచవ్యాప్తం చేస్తున్న ధూమపానం నిదర్శనాలు.

  • జోస్యుల వేణుగోపాల్‌

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/