ఒక్క అడుగు సమానత్వం వైపు

విద్యారంగంలో నూతన మార్పులు అనివార్యం

ఒక్క అడుగు సమానత్వం వైపు
School education

ప్రాచీన భారతదేశ ఇండస్‌ నాగరికత విద్యావిధానాన్ని పరిశీలిస్తే బొమ్మల లిపిలో ఉన్నట్లు అనేక ఆధారాలున్నాయి. లోకయుతగలు, చార్వాకులు సమాజంలోని ప్రజలందరికీ సమానమైన హేతు బద్ధమైన విద్యను అందించారు.

ఆర్యుల దండయాత్రతో సమాన త్వమే పునాదిగా ఉన్న భారతదేశ సామాజిక, సంస్కృతి, ఆర్థిక రాజకీయ, విద్య మొదలగు వ్యవస్థ లను పూర్తిగా ధ్వంసం చేసి వర్ణ వ్యవస్థను సృష్టించారు. దీనిని నాశన కాలంగా చరిత్రకారులు అభివర్ణించారు.

తరువాతి కాలంలో ప్రపంచంలోనే మొట్టమొదటి సామాజిక ఉద్యమకారుడు అయిన గౌతమబుద్ధుని బోధనలతో చైతన్యం చెందిన సమాజం ‘బహుజన హితాయ బహుజన సుఖాయ నినాదంతో క్రూరమైన వర్ణవ్యవస్థ నిర్మూలనకు బాటలు వేసి సమాజంలో అందరూ సమానమే అని నిరూపించ జ్ఞానసంపత్తిని ఎల్లలు లేని ప్రపంచమంతా పరిఢవిల్లినట్లు చరిత్ర చెబుతున్నది.

విద్య ను కుల, మత, ప్రాంత,లింగ, వర్గ బేధాలు లేకుండా ప్రతి భార తీయుడికి గౌతమ బుద్ధుడు కాలం మాదిరి సమానమైన నాణ్య మైన విద్యను మాత్రమే అందించాలని రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుగా పొందుపరిచారు.

స్వాతంత్య్రం వచ్చి 73 సంవత్సరాలు గడిచిన నాణ్యమైన సమానమైన విద్యను అందుకునే విషయంలో మెజారిటీ బహుజనులకు అందని ద్రాక్షలాగే ఉంది. మనదేశంలోని అన్ని రాష్ట్రాలతోపాటు ఆంధ్రప్రదేశ్‌ కూడా కలుపుకుని ప్రస్తుత విద్యావిధానాన్ని పరిశీలిస్తే అసమానతలు కొట్టవచ్చినట్లు కనిపిస్తా యి.

అసమానతలతో కూడిన విద్యను విద్యార్థులకు అందిస్తూ అవకాశాలను అంటే ఉద్యోగాలను అందు కునేటప్పుడు మాత్రం బలవంతునికి బలహీనుడుకు పోటీపెట్టినట్లు అర్హత కలిగిన అందరికీ ఒకే పరీక్ష.

ఇంగ్లీష్‌ మీడియంలో ఉన్న కొద్ది మంది గుత్తాధిపత్యంలో ఉద్యోగ, ఆధిపత్యం అవకాశాలు ఉండేలా ఆది నుండి చేస్తూ వస్తున్న చట్టాలకు,చర్యలకు కొనసాగింపులాగే ప్రభుత్వపాఠశాలల్లో పేద విద్యార్థులకు ఇంగ్లీష్‌ మీడియంపై ప్రభుత్వ హైకోర్టు తీర్పు ఉన్నది అనిపిస్తుంది.

అదేవిధంగా దీనిని కొంత మంది రాజకీయ కోణంలో మరికొంత మంది కులం కోణంలో ఈ సమాజంలో మేధావి వర్గంగానో, అభ్యుదయవాదులుగానో అనుకుంటూ చెలా మణి అవ్ఞతున్న కొన్ని సంఘాలు, పార్టీలు ఇంగ్లీష్‌ మీడియం విద్యావిధానాన్ని సమర్థించే వాళ్లు, వ్యతిరేకించే వాళ్లు ఉన్నారు.

ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా సమాజంలో చాలా మంది ఈ విషయాన్ని డబ్బులు ఉన్న వారికి ఇంగ్లీష్‌ మీడియం, పేద, అట్టడుగువారికి మాత్రం తెలుగు మీడియం అని వాస్తవంగా అర్థం చేసుకుంటున్నారు.

పేదవర్గాలు మాత్రం దీనిని పూర్తిగా స్వాగతిస్తు న్నారు. ఎందుకంటే వారు ఏది కోల్పోయారో వారి పిల్లల భవిష్య త్తుకు ఏది అవసరమో అనే విషయాన్ని గుర్తించారు.

అందుకే హైకోర్టు సూచన మేరకు ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో 96.17 శాతం, అదే విధంగా స్కూల్‌ పేరెంట్స్‌ కమిటీ నుండి 94 శాతం తీర్మానాలద్వారా ఆంగ్ల మాధ్యమాన్ని కోరుకోవడం మెజార్టీ ప్రజల బలమైన ఆకాంక్షగా తెలుస్తోంది.

వాస్తవానికి ఆంగ్ల మాధ్యమానికి వ్యతిరేకంగా మాట్లాడేవాళ్లు పూర్తిగా ఆంగ్లంలో చదువ్ఞతూ ఆంగ్లంలోనే జీవిస్తున్నారనేది జగమెరిగిన సత్యం.

ఆరువందల సంవత్సరాలు పరిపాలించిన మొఘల్‌ సామ్రాజ్యంలో రెండు వందల సంవత్సరాలు పరిపాలించిన బ్రిటిష్‌ సామ్రాజ్యంలో స్వాతంత్య్రానికి ముందు కేవలం పన్నెండు శాతం అక్షరాస్యత ఉన్న అఖండ భారతదేశంలో మన మాతృభాష తెలుగు బతికే ఉన్నది.

కేవలం ప్రభుత్వ బడిలో పేద పిల్లలు చదవకపోతే తెలుగు చచ్చిపోతుంది అనితప్పుడు ప్రచారం చేస్తున్నారు.

తెలుగు మాధ్యమ విద్యార్థుల కోసం మండల కేంద్రంలో ఒక్క పాఠశాలను ఏర్పాటు చేసి వారికి ఉచిత ప్రయాణం, ఖర్చు చెల్లించటం ద్వారా అటు తెలుగు మాధ్యమానికి ఇటు ఇంగ్లీష్‌ మాధ్యమానికి ప్రభు త్వం సమాంతర ప్రాధాన్యతను ఇస్తుంది. ఇంగ్లీష్‌ మీడియం ప్రవే ేశపెడుతున్నారు బాగానే ఉంది.

అదేవిధంగా ప్రజలలో మరింత నమ్మకం కలగాలి అంటే ప్రభుత్వ పాఠశాలలపై ప్రజలలో ఉన్న నమ్మకం మరింత బలపడి ప్రభుత్వ పాఠశాలల పునర్నిర్మాణం సులభతరమవుతుంది.

ప్రభుత్వ విధానాల వల్ల విద్యార్థులు ప్రభుత్వపాఠశాలల్లో చేరే అవకా శాలు మెండుగా ఉన్నందున డిస్ట్రిక్ట్‌ సెలక్షన్‌ కమిటీ ద్వారా శాశ్వత ప్రాతిపదికన అధ్యాపకులను ప్రతి సంవత్సరం నియమించే విధంగా ప్రణాళికను సిద్ధం చేయాలి.

స్కూల్స్‌లో జవాబుదారీతనం పెరగడానికి పాఠశాల పేరెంట్స్‌ కమిటీలను ఏర్పాటు చేయడం మంచి పరిణామమే కానీ పేరెంట్స్‌ కమిటీలలో ఎక్కువ మంది విద్యావంతులు కాకపోవడం పేదరికంలో ఉన్న పేరెంట్స్‌కు పని భారంతో సమయం లేకపోవడం పాఠశాల విషయాలపై అవగా హనలేక పర్యవేక్షణ లోపంకనిపిస్తుంది.

ప్రభుత్వపాఠశాల అభి వృద్ధి చెందితే గ్రామాల్లో, పట్టణాల్లో కుల, మత, ధనిక, పేద, తేడాలు లేకుండా అందరూ అడ్మిషన్స్‌ పొంది నట్లయితే పేరెంట్స్‌ కమిటీ భాగస్వామ్యంతో స్కూల్స్‌ పారదర్శ కంగా పనిచేస్తాయి.

ఈ విషయాలన్నీ సక్రమంగా జరిగినట్లయితే ప్రభుత్వ పాఠశాల విద్యలో ఢిల్లీ, కేరళ రాష్ట్రాల సరసన ఆంధ్రప్రదేశ్‌రాష్ట్రం చేరి దేశానికి ఆదర్శంగా ఉంటుంది.

  • డాక్టర్‌ సుబ్బయ్య బోరుగడ్డ, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/