ప్రజాజీవితాన్ని కలవరపెడుతున్న కరోనా

జాగ్రత్త మినహా మందులే లేవు

Carona Virus

కరోనా వైరస్‌. జాగ్రత్తగా ఉండటం తప్ప మందులే లేని ఈ కరోనా వైరస్‌ బారిన పడకుండా ఉండేందుకు అన్ని దేశాలు చర్యలు ముమ్మరం చేయగా రోజురోజుకీ దాని తీవ్రత పెరిగి ప్రపంచ దేశాలకు వ్యాపిస్తుంది.

చైనా ఇప్పుడు చిగురుటాకులా వణికిపోతుంది. రోజురోజుకీ సుదూర తీరాలకు చేరి అనేక దేశాలలో కరోనా కలవరం మొదలయింది. పశ్చిమాసియా, యూరప్‌లో అనేక ప్రాంతాల్లో కొత్తగా వ్యాప్తి చెందుతోంది. ఇరాన్‌లో అనేక మంది మృత్యువాతపడ్డారు. ఇటలీలో ప్రబలిన వారం తర్వాత యూరప్‌లో వ్యాపించడం మొదలైంది. వాటిలో డెన్మార్క్‌,రొమేనియా, గ్రీన్‌, స్విట్జర్లాండ్‌, ఆస్ట్రేలియా ఉన్నాయి. దక్షిణ అమెరికాలో కరోనా కేసు నమోదైన తొలి దేశం బ్రెజిల్‌. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణాలో, ఢిల్లీ, రాజస్థాన్‌ ఇలా దేశంలో చాలా చోట్ల కరోనా కలకలం చెలరేగుతుంది.

అంతేకాక అమెరికా, థా§్‌ులాండ్‌, ఆస్ట్రేలియాలో తొలి కరోనా వైరస్‌ మృతి కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం వైరస్‌ ప్రపంచవ్యాప్తంగా 75 దేశా లకు పైగా విస్తరించిందని అంచనా. ఈ మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య చైనాలోనాలుగువేలకు దగ్గరగా చేరింది. అనధికారికంగా ఇంకా ఎక్కువే అని తెలుస్తుంది. ఇప్పటివరకు వైరస్‌తో చికిత్సపొందుతున్న బాధితుల సంఖ్య ఒక లక్షకు చేరింది.వీరిలో 25వేల మందికిపైగా రోగుల పరిస్థితి విషమంగా ఉన్నది. అయితే సమస్య తీవ్ర తగ్గుముఖం పట్టిం దన్న సంతోషం ఎక్కువ రోజులు ఉండనియ్యలేదు.

రోజురోజు కూ మృతుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది.అధికజనాభా,అపరి శుభ్ర పరిస్థితులు, మూఢ నమ్మకాలు, అవిద్య,నిర్లక్ష్యం అధికంగా ఉండే భారత్‌ లాంటి దేశంపై కరోనా దెబ్బపడితే ఎలాగుంటుం దో ఊహించడం కష్టం. ఇప్పుడిప్పుడే కొన్ని కేసులు వెలుగులోకి వస్తున్నాయి

.విదేశాల నుంచి మోసు కొస్తున్న వైరస్‌ను ఎక్కడిక క్కడే ఖండిస్తున్నారు. అయినప్పటికీ కొత్త కేసులు ఇటు ప్రజల్లో, అటు ప్రభుత్వంలో దడా పుట్టిస్తు న్నాయి. అత్యున్నత సాంకేతి కత కలిగి ప్రపంచ మార్కెట్‌ను శాసిస్తున్న చైనాయే కరోనా దెబ్బకు క్యా’కరోనా అని తలపట్టు కు కూర్చుంది. ఆర్థికరంగం అతలాకుతలం అయింది. ఎక్కడి కక్కడ ద్వారాలు మూసుకుపోతు న్నాయి.

జనం రోడ్ల మీదకు రావాలంటే భయపడుతున్నారు. పరిశ్రమలు స్తంబించిపోతున్నా యి.ఉత్పత్తి కుంటుబడింది. ఇంతవేగంగా విస్తరిస్తున్న కరోనాను ఆపడానికి శతవిధాల ప్రయత్ని స్తున్నారు.ఈ మధ్యనే చైనాలో జంతు మాంసంతినడం ఆపమని వేడుకుంటే మొన్నటికి మొన్న ఫ్రాన్స్‌ఆరోగ్యమంత్రి కరచాలనం వద్దని ప్రజలకు సూచించారు.

కరోనా దెబ్బకుకేవలం చైనా ఆర్థికవ్యవస్థకేకాకుండా ప్రపంచ ఆర్థికవ్యవస్థకు కూడా పెనుముప్పుగా మారిందని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.కరోనా వైరస్‌ పేరుచెబితేనే ప్రపంచ మార్కెట్లన్నీ కుదేలవ్ఞతున్నాయి. ఇప్పటికే కరోనా వైరస్‌ దెబ్బకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఢీలాపడింది. కరోనా ఎఫెక్ట్‌తో ఇప్పటికే చైనా జిడిపి కొంతమేరతగ్గింది.కరోనా ప్రభావం వల్ల 2003లో చైనాలో వచ్చిన సార్స్‌వైరస్‌కంటే అధికంగా ఉండటంతో చైనాతో పాటు ప్రపంచదేశాలపై ఈ ప్రభావం పడనుంది.

ప్రపంచంలోనే రెండోఅతిపెద్ద ఆర్థికవ్యవస్థగా ఉన్న చైనాదెబ్బతింటే ఆ ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా వైరస్‌కుత్వరగా మందును కొనుక్కొంటే కొంతమేర ఈ ప్రభావాన్ని తగ్గించ వచ్చని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

  • కాళంరాజు వేణుగోపాల్‌

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/