ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్న కరోనా
కరోనా ప్రభావంతో చైనాలో తయారీరంగం భారీగా తగ్గుముఖం

ఐక్యారాజ్యసమితి: ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా వ్యాపిస్తున్న కరోనావైరస్ (కొవిడ్-19) వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఈ ప్రభావం తీవ్రత ఇప్పటికే దాదాపు 15 దేశాలపై అధికంగా ఉందని ఐక్యరాజ్యసమితి తాజా నివేదించింది. ఈ 15 దేశాల్లో భారత్ కూడా ఉండటం ఆందోళన కలిగించే విషయం. ఇది భారత వాణిజ్యరంగంపై దాదాపు 34.8 కోట్ల డాలర్ల వరకు ఉండవచ్చని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. కరోనా ప్రభావంతో చైనాలో తయారీరంగం భారీగా తగ్గుముఖం పట్టింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా చైనా ముడిసరుకులపై ఆధారపడిన దేశాల ఆర్థికవ్యవస్థలపై ఇది స్పష్టంగా కనిపించిందని ఐక్యారాజ్యసమితి వాణిజ్యాభివృద్ధి వేదిక (యూఎన్‌సీటీఏడీ) పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 5వేల కోట్ల డాలర్ల విలువైన ఎగుమతులపై దీని ప్రభావం ఉన్నట్లు అంచనా వేసింది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/