అమెరికాలో తొమ్మిదికి చేరిన కరోనా మృతులు

US coronavirus
US coronavirus

వాషింగ్టన్‌: అమెరికాలో కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) కలకలం రేపుతుంది. ఈవైరస్‌తో మృతుల సంఖ్య తొమ్మిదికి చేరింది. వీరంతా వాషింగ్టన్‌ రాష్ట్రానికి చెందినవారే. మరోవైపు బాధితుల సంఖ్య 100 దాటినట్టు అధికారులు తెలిపారు. వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది. మరోవైపు చైనాలో కొత్తగా వైరస్‌ బారిన పడ్డవారి సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తున్నది. మంగళవారం 115 మందికి కొవిడ్‌ సోకినట్టు గుర్తించారు. మరో 38 మంది మరణించడంతో మృతుల సంఖ్య 2,981కి చేరింది. ఇక దక్షిణకొరియాలో 142 మంది కొత్తవారికి వైరస్‌ సంక్రమించినట్టు ధ్రువీకరించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/