హైదరాబాద్‌లో మాస్క్‌లకు విపరీతమైన డిమాండ్‌

రూ.1.50 వి రూ.50 కి అమ్ముతున్న వైనం

Huge demand of Masks in hyderabad
Huge demand of Masks in hyderabad

హైదరాబాద్‌: ప్రస్తుతం హైదరాబాద్‌లో కొత్త దందా మొదలైంది. తెలుగు రాష్ట్రాలను కరోనా భయం పట్టుకున్న వేళ, ముఖానికి ధరించే మాస్కులకు డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. మెడికల్ షాపుల యజమానులు తమ వద్ద ఉన్న మాస్క్ లను బ్లాక్ చేస్తున్నారన్న విమర్శలు పెరిగాయి. సాధారణంగా రూ. 1.50 నుంచి రెండు రూపాయలు ఉండే మాస్క్ ను ఇప్పుడు రూ. 50కి అమ్ముతున్న పరిస్థితి. 100 మాస్క్ ల ప్యాక్ రూ. 140 కాగా, ఇప్పుడు దాన్ని రూ. 1000కి విక్రయిస్తున్నారు.

ఇక క్వాలిటీ అధికంగా ఉండే ఎన్ 95 మాస్క్ ధర రూ. 40 కాగా, ఇప్పుడు ఏకంగా రూ. 600కు విక్రయిస్తున్నారు. చేరింది. స్మార్ట్ ఫోన్ స్క్రీన్ గార్డుల ధరలకూ రెక్కలు వచ్చాయి. రూ. 40కి విక్రయిస్తున్న స్క్రీన్ గార్డులను ఇప్పుడు రూ. 80 నుంచి రూ. 100 మధ్య అమ్ముతున్నారు. పలు మెడికల్ షాపుల్లో మాస్క్ ల స్టాక్ లేదన్న బోర్డులు కనిపిస్తున్నాయి. ఇక కరోనాకు ముందు కిలో చికెన్ ధర రూ. 200కు పైగా ఉండగా, ఇప్పుడు ధర రూ. 120కి పడిపోయింది. అయినా కొనేవారు కనిపించడం లేదని మాంసం విక్రయదారులు వాపోతున్నారు.

తాజా ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/devotional/