ఇండియా కూటమి 400 సీట్లు సాధిస్తుంది – ఖర్గే

దేశ వ్యాప్తంగా గత కొద్దీ రోజులుగా సార్వత్రిక ఎన్నికలు జోరు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మొత్తం 7 దశల్లో ఈ పోలింగ్ ను ఏర్పాటు చేయగా..ఇప్పటికే ఆరు దశల పోలింగ్ పూర్తి అయ్యింది. జూన్ 1 న చివరి దశ పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికలపై ఎవరికీ వారే విజయం ఫై ధీమా వ్యక్తం చేస్తూ వస్తున్నారు. బిజెపి 400 సీట్లు సాదిస్తుందని చెపుతుంటే..కాంగ్రెస్ సైతం ఇండియా కూటమి 400 సీట్లు సాదిస్తుందని అంటుంది. తాజాగా అమృత్‌సర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఖర్గే మాట్లాడుతూ… పలు రాష్ట్రాల్లో అసలు బిజెపికి ఉనికే లేదు..అయినప్పటికీ అక్కడ గెలుస్తాం అని ధీమా వ్యక్తం చేస్తుంది.. ఉనికిలోనే లేని పార్టీ అన్ని స్థానాలు ఎలా గెలుచుకుంటుందో చెప్పాలని డిమాండ్ చేసారు. .

గత ఎన్నికలతో పోలిస్తే బీజేపీ ఇప్పుడు చాలా సీట్లను కోల్పోనుందని , ఇండియా కూటమి పుంజుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటకలో బీజేపీ బలంగా లేదని , మహారాష్ట్రలోనూ బలహీనంగా ఉందని ఖర్గే పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్, ఒడిశాలలో మాత్రమే ఫైట్ ఇస్తోందన్నారు. ఇలాంటప్పుడు వారు చెప్పినన్ని సీట్లు ఎలా వస్తాయని ఆయన ప్రశ్నించారు.