ఒకే రోజు మూడు రాష్ట్రాల్లో మోడీ పర్యటన

pm-modi-speaking-in-a-party-meeting-in-begumpet

ప్రధాని మోడీ ఒకేరోజు మూడు రాష్ట్రాల్లో పర్యటించబోతున్నారు. అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ లో నేడు ప్రధాని పర్యటించబోతున్నారు. ముందుగా అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఇటానగర్ కు 25 కిలోమీటర్ల దూరంలో నిర్మించిన గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ ను ప్రారంభించారు. ఆ తర్వాత యూపీలోని తన నియోజకవర్గమైన వారణాసికి వెళతారు. అక్కడ నెల రోజుల పాటు సాగే కాశీ తమిళ్ సంగమం కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.

అనంతరం వచ్చే నెల ఎన్నికలు జరిగే స్వరాష్ట్రం గుజరాత్ కు వెళ్లనున్నారు. ఇటానగర్ సమీపంలోని డోనీ పోలో ఎయిర్ పోర్ట్ ను ప్రారంభించిన అనంతరం ప్రధాని మాట్లాడనున్నారు. 2019 లోక్ సభ ఎన్నికల ముందు ప్రధాని ఈ ఎయిర్ పోర్ట్ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. దీంతో దీన్ని ఎన్నికల ఎత్తుగడగా ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇక అరుణాచల్ లో 600 మెగావాట్ల కమెంగ్ హైడ్రో పవర్ స్టేషన్ ను ప్రధాని జాతికి అంకితం చేశారు.