దావోస్‌ వెళ్లేందుకు నా స్నేహితులు సహాయం చేశారు

వాళ్లు కనుక ఖర్చు పెట్టకపోయినట్లైతే తాను దావోస్‌ వెళ్లకపోదును

Imran Khan
Imran Khan

దావోస్‌: పాకిస్థాన్‌ ఆర్థిక పరిస్థితి వల్ల అక్కడి నేతలకు విదేశీ పర్యటనలపై నియంత్రణ ఉన్న విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రపంచ ఆర్ధిక సదస్సు (డబ్ల్యూఈఎఫ్‌) కోసం దావోస్‌ వెళ్లేందుకు ఆయనకు అతని స్నేహితులు సహాయం చేశారట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. ఇద్దరు స్నేహితులైన వ్యాపారవేత్తలు హేహగల్‌, ఇమ్రాన్‌ చౌదరిలు ఆ ఖర్చులు భరించనట్లు ఇమ్రాన్‌ఖాన్‌ తెలిపారు. దావోస్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ విషయాన్ని చెప్పారు. వాళ్లు కనుక ఖర్చు పెట్టకపోయినట్లైతే తాను దావోస్‌ రాగలిగే వాడిని కదన్నారు. నా స్నేహితుడు హెహగల్‌ రిటైర్డు మిలటరీ అధికారి, వ్యాపారవేత్తకు కృతజ్ఞతలు తెలిపారు. నేను ఇక్కడికి వచ్చేందుకు ఆయన ఎంతో సహాయం చేశారని అన్నారు. ఇక్కడ రెండు రాత్రులు గడిపేందుకు అయిన 450000 డాలర్లు ఖర్చును మా ప్రభుత్వం పై వేయలేనని అవి మా ప్రభుత్వం చెల్లించలేదని పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ అన్నట్లు పాక్‌ పత్రిక డాన్‌ పేర్కొంది.

తాజా తెలంగాణ వార్త కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/