24 ఏళ్ల యువకుడి అనుమానాస్పద మృతి

హస్తినలోని ఓ ఫైవ్‌ స్టార్‌ హోటల్‌లో ఘటన

Young man dead body found in hotel room
Young man dead body found in hotel room

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ నగరంలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో ఇరవై నాలుగేళ్ల ఓ యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. మరణించిన వ్యక్తిని ఢిల్లీలోని మాల్వీయ నగర్ ప్రాంతంలో నివసింరచే కరన్ చంద్రగా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జనవరి నుంచి కరన్ ఫైవ్ స్టార్ హోటల్ లో ఓ గది తీసుకుని అక్కడే ఉంటున్నాడు. ఈ నెల 20వ తేదీన తన గది డోర్ కు బయట వైపు డోంట్ డిస్టర్బ్ అని నోట్ రాసి అతికించాడు. అయితే, శుక్రవారం రూమ్ చెక్ అవుట్ కోసం మేనేజర్ అతని గది నంబర్ తోపాటు వ్యక్తిగత ఫోన్ ను సంప్రదించినా సమాధానం లేకపోవడంతో హోటల్ సిబ్బంది గది దగ్గరికి వెళ్లగా.. గది నుంచి దుర్వాసన వస్తుండడంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు గది తలుపులు తెరిచి చూడగా..అతని డెడ్ బాడీ కనిపించింది. ఆ గదిలో నుంచి సూసైడ్ నోట్ తోపాటు కొన్ని మెడిసిన్ స్ట్రిప్స్ ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతని బాడీపై ఎలాంటి గాయాలు కనిపించకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చపట్టారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/