భారీ వర్షాలు.. తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీ

బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావమే కారణం

Heavy rains for the next 48 hours
imd-has-issued-a-yellow-alert-to-telangana

హైదరాబాద్ః రానున్న రెండు రోజుల్లో తెలంగాణలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో వచ్చే రెండు రోజులు భారీ వర్షాలు కురవొచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దాంతో, రాష్ట్రానికి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉత్తర, ఈశాన్య, తూర్పు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. అదే సమయంలో హైదరాబాద్ లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ క్రమంలో రాబోయే రెండు రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

సాయంత్రం, రాత్రి సమయాల్లోనే ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్నం తెలిపారు. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో మంచిర్యాల, జగిత్యాల, ములుగు, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, వరంగల్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. దాంతో, ఆ జిల్లాల అధికారులను అప్రమత్తం చేశారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/