నోయిడా ఘటనలో మృతులకు ముఖ్యమంత్రి యోగి సంతాపం

yogi adityanath
yogi adityanath

లక్నోః ఉత్తర్ ప్రదేశ్ లోని నోయిడా ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంతాపం తెలిపారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకుని యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని సీనియర్‌ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ ఘటనలో గాయపడిన వారికి సరైన చికిత్స అందేలా చూడాలని ఆదేశించారు. అయితే అపార్ట్ మెంట్ కాంప్లెక్స్ సమీపంలో డ్రైనేజీ వ్యవస్థను మరమ్మతు చేసేందుకు నోయిడా డెవలప్ మెంట్ అథారిటీ కాంట్రాక్ట్ ఇచ్చిందని జిల్లా మేజిస్ట్రేట్ తెలిపారు. కూలీలు ఇటుకలను బయటకు తీస్తుండగా గోడ కూలిపోయిందని, దీనిపై విచారణ జరుపుతామని స్పష్టం చేశారు.

కాగా, నోయిడాలో రెసిడెన్షియల్ సొసైటీ సరిహద్దు గోడ కూలిపోవడంతో నలుగురు భవన నిర్మాణ కార్మికులు చనిపోయారు. ఈ ఘటనలో 9మంది గాయపడ్డారు. నోయిడాలోని సెక్టార్ 21లోని పెద్ద గృహ సముదాయమైన జల్ వాయు విహార్ వద్ద జరిగిన ఈ ఘటనలో శిథిలాలను తొలగించేందుకు బుల్డోజర్లు ఇప్పటికే అక్కడికి చేరుకున్నాయి. మరికొందరు కూలీలు శిథిలాల కింద చిక్కుకుని ఉండొచ్చనే అనుమానంతో సీనియర్ అధికారులతో సహా అగ్నిమాపక శాఖ సిబ్బంది సహాయ చర్యలు చేపట్టారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/