మెగాస్టార్ కు చెల్లెలుగా రమ్యకృష్ణ..?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస రీమేక్ లతో అదరగొడుతున్నారు. ఓ సినిమా సెట్స్ ఫై ఉండగానే మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాదు సెట్స్ పైకి తీసుకెళ్తున్నారు. రీసెంట్‌గా ఆచార్య షూటింగ్ పూర్తి చేసిన చిరు..ఇప్పుడు గాడ్ ఫాద‌ర్ చిత్ర షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. ఈ మూవీ మోహన్‌రాజా దర్శకత్వంలో తెరకెక్కుతుండగా..ఈ సినిమాలో హీరోకి వరుసకు సోదరి అయ్యే ఓ మహిళ పాత్ర చాలా కీలకం కానుందట.

ఈ పాత్రలో శోభన, విద్యాబాలన్ లాంటి వాళ్ళ పేర్లను పరిశీలించిన చిత్ర యూనిట్ చివరకు రమ్యకృష్ణను ఫైనల్ చేశారని సమాచారం. ఇప్పటికే ఆమెతో సంప్రదింపులు కూడా పూర్తయ్యాయని, చిరు చెల్లెలిగా వెండితెరపై మెప్పించడానికి రమ్యకృష్ణ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని టాక్. ఇక చిరంజీవి – రమ్యకృష్ణ కలయికలో ఎన్నో సినిమాలు వచ్చి బాక్స్ ఆఫీస్ వద్ద మెగా హిట్స్ సాధించాయి. మరి ఇప్పుడు చిరు కు చెల్లెలుగా రమ్యకృష్ణ ఎలా కనిపిస్తుందో చూడాలి. ఇక ఆచార్య విషయానికి వస్తే..కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ మూవీ లో రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో కనిపిస్తున్నాడు. ఆయనకు జోడిగా పూజా హగ్దే నటిస్తుంది. ఫిబ్రవరి 04 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.