జపాన్​ మాజీ ప్రధాని షింజో అబేపై కాల్పులు

ఓ వీధిలో ప్రసంగిస్తున్న సమయంలో కాల్పులు

former-prime-minister-shinzo-abe-has-been-shot-in-the-city-of-nara

టోక్యోః జపాన్​ మాజీ ప్రధాని షింజో అబేపై కాల్పులు జరిగాయి. ఈ మేరకు జపాన్​కు చెందిన ఎన్​హెచ్​కే వరల్డ్​ న్యూస్​ వెల్లడించింది. పశ్చిమ జపాన్ నగరమైన నారాలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తున్న షింజో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఈ ఘటనలో ఆయనకు గాయాలు కూడా అయ్యాయి. అంతకంటే ముందు కాల్పుల శబ్దం వినిపించినట్టు చెబుతున్నారు. రక్తమోడుతున్న మాజీ ప్రధానిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అనుమానితుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్టు స్థానిక మీడియా తెలిపింది.

67 ఏళ్ల షింజే ఓ వీధిలో ప్రసంగిస్తున్న సమయంలో కాల్పులు జరిగినట్టు ఎన్‌హెచ్‌కే అనే మీడియా సంస్థ తెలిపింది. రెండుసార్లు తుపాకి కాల్పుల వంటి శబ్దం వినిపించిందని, ఘటనా స్థలంలోనే అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారని పేర్కొంది. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం 11.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. జపాన్​లో గన్​ వినియోగంపై కఠిన ఆంక్షలు అమల్లో ఉన్నాయి. అయినా.. ఒక మాజీ ప్రధానిపై ఇలా జరగడం చర్చనీయాంశమైంది.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/movies/