బికినీలో బేబీ బంప్ తో ఇలియానా

బికినీలో బేబీ బంప్ తో ఇలియానా హాట్ పోజ్ ఇచ్చింది. ఇలియానా.. దేవదాసు మూవీ తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ నడుము సుందరి.. ఆ తర్వాత పోకిరి, జల్సా, కిక్ సినిమాలతో అతి తక్కువ టైంలోనే టాప్ హీరోయిన్ రేంజ్ కు వెళ్లింది. తన అందచందాలతో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన ఈ బ్యూటీ.. 2012 తర్వాత టాలీవుడ్ కు దూరమై.. బాలీవుడ్ కు దగ్గరైంది. అయినప్పటికీ ఈ గోవా బ్యూటీకి అనుకున్నన్ని అవకాశాలు, విజయాలు దక్కలేదు. దాంతో మళ్లీ తెలుగు ఫై ఫోకస్ చేసింది. రవితేజ నటించిన అమర్ అక్బర్ ఆంటోని చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చింది. కానీ ఈ మూవీ ప్లాప్ కావడం తో మరో ఛాన్స్ దక్కలేదు. అయినప్పటికీ తనవంతు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ నిర్మాతలు మాత్రం పట్టించుకోలేదు. దాంతో ఇలియానా కొత్త జీవితంలో అడుగు పెట్టాలని అనుకుందేమో తల్లి గా మారింది.

ఇప్పటి వరకు ఇలియానా పెళ్లి చేసుకోలేదు.. అలాగే ఇలియానా ఎవరితో రిలేషన్ లో ఉంది అనే విషయాన్ని కూడా క్లారిటీ ఇవ్వలేదు. కానీ తన యొక్క ప్రెగ్నెన్సీ విషయాన్ని పదే పదే సోషల్ మీడియా ద్వారా రివీల్ చేయడం జరిగింది. తాజాగా మరోసారి బేబీ బంప్ ఫోటోలు షేర్ చేసింది. బీచ్ లో ఎండలో సేద తీరుతూ బికినీలో బేబీ బంప్ తో ఇలియానా షేర్ చేసిన ఫోటోలు అందరి దృష్టి ని ఆకర్షిస్తున్నాయి.