బాలయ్య షో లో లైగర్..

నటసింహం నందమూరి బాలకృష్ణ ఫస్ట్ టైం ఓటీటీ వరల్డ్ లోకి ఎంట్రీ ఇచ్చి రికార్డ్స్ నెలకొల్పుతున్నాడు. ఆహా ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతున్న అన్ స్టాపబుల్ తో బాలకృష్ణ అభిమానులను మరియు ప్రేక్షకులను తెగ ఎంటర్ టైన్ చేస్తున్నాడు. పెద్ద ఎత్తున అంచనాలతో ప్రారంభం అయిన అన్ స్టాపబుల్‌ సూపర్‌ హిట్ అయ్యింది. ఇప్పటివరకు ఈ షో కు పలువురు అగ్ర హీరోలు , దర్శకులు , కమెడియన్స్ హాజరై అనేక విశేషాలు పంచుకున్నారు. ఇక ఇప్పుడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ హాజరయ్యారు.

‘అన్ స్టాపబుల్ విత్ NBK’ తొమ్మిదో ఎపిసోడ్ కు గాను విజయ్ దేవరకొండ హాజరయ్యారు. ఇప్పటికే ఈ ఎపిసోడ్ షూటింగ్ పూర్తయింది. సంక్రాంతి స్పెషల్ గా ఈ ఎపిసోడ్ రానుందని తెలుస్తుంది. ఈ ఎపిసోడ్ పండగ ఎపిసోడ్ కావడంతో బాలయ్య పంచ కట్టుకొచ్చారు. బాలకృష్ణ, విజయ్ దేవరకొండ కలిసి ఉన్న ఒక ఫోటో ఇప్పుడు లీక్ అవ్వడంతో అటు బాలయ్య అభిమానులతో పాటు విజయ్ అభిమానులు కూడా ఈ ఎపిసోడ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటె ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ IMDB టాప్ 10 లో స్థానం సంపాదించి వార్తల్లో నిలిచింది. టాప్ 10 రియాలిటీ టీవీ, టాక్ షో కేటగిరీ లో ఈ షో స్థానం సంపాదించుకుంది. 9.2 రేటింగ్ తో టాప్ 10 లో నిలవడం పట్ల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇక విజయ్ దేవరకొండ సినిమాల విషయానికి వస్తే..ప్రస్తుతం పూరి డైరెక్షన్లో లైగర్ సినిమా చేస్తున్నాడు. పాన్ ఇండియా గా ఈ మూవీ పలు భాషల్లో ఆగష్టు 25 న విడుదల కాబోతుంది.