ప్రజలంతా సునీతకు మద్దతుగా నిలవాలిః అయ్యన్నపాత్రుడు

వివేకా హత్య కేసులో ఆఫ్ట్రాల్ ఒక ఎంపీని అరెస్ట్ చేయలేకపోయారన్న అయ్యన్న

ayyanna patrudu
ayyanna patrudu

అమరావతిః మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆఫ్ట్రాల్ ఒక ఎంపీని అరెస్ట్ చేయలేకపోయారని టిడిపి సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు విమర్శించారు. వైఎస్‌ఆర్‌సిపికి చెందిన 30 మంది ఎంపీలకు అవినాశ్ రెడ్డిని కాపాడటం తప్ప మరే పని లేదని అన్నారు. కర్నూలులో వైఎస్‌ఆర్‌సిపి గూండాలు సీబీఐని అడ్డుకోవడం వెనుక పెద్దల హస్తం ఉందని చెప్పారు. వివేకా హత్య కేసులో అలుపెరుగని పోరాటం చేస్తున్న సునీతను అభినందించారు. ప్రజలంతా సునీతకు మద్దతుగా నిలవాలని కోరారు. ఏళ్ల తరబడి కోర్టుకు వెళ్లకుండా ఉన్న ఘనత దేశ చరిత్రలో జగన్ కే దక్కుతుందని చెప్పారు.