ఐసిఐసిఐ నికర లాభం రూ.4,146 కోట్లు

ICICI Bank
ICICI Bank

ముంబయి: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ప్రైవేటు రంగ దిగ్గజ ఐసీఐసీఐ అదుర్స్‌ అనిపించింది. డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో స్థాండ్‌ఎలోన్‌ ప్రాతిపదికన బ్యాంక్‌ నికరలాభం రెండు రెట్లకు పైగా పెరిగి రూ. 4,146.46కోట్లుగా నమోదైంది. 2018 అక్టోబరు-డిసెంబరు త్రైమాసికంలో కంపెనీ నమోదు చేసిన రూ.1,604.91 కోట్ల నికరలాభంతో పోలిస్తే ఇది 158 శాతం ఎక్కువ కావడం విశేషం. సమీక్షిస్తున్న మూడో త్రైమాసికంలో బ్యాంక్‌ మొత్తం ఆదాయం కూడా 17.23 శాతం పెరిగి రూ.23,638.26 కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో బ్యాంక్‌ ఆదాయం రూ.20,163.25 కోట్లుగా ఉంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/