స్వైన్‌ప్లూ .. సాఫ్ట్‌వేర్‌ కార్యాలయాల మూసివేత

సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు ఇంటి వద్ద నుంచి పనిచేయాలి

Software Giant SAP Shuts India Offices After Swine Flu Scare
Software Giant SAP Shuts India Offices After Swine Flu Scare

న్యూఢిల్లీ: బెంగళూరు నగరంలో ఎస్ఏపీ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఇద్దరు ఉద్యోగులకు స్వైన్ ఫ్లూ పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా తమ కంపెనీ కార్యాలయాలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు సాఫ్ట్‌వేర్ జెయింట్ ఎస్ఏపీ శుక్రవారం ప్రకటించింది. బెంగళూరుతోపాటు గురుగ్రామ్, ముంబై నగరాల్లో ఎస్ఏపీ కార్యాలయాలను మూసివేస్తున్నామని, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు ఇంటి వద్ద నుంచి పనిచేయాలని జర్మన్ టెక్ దిగ్గజం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. బెంగళూరు నగరంలోని ఆర్ఎంజడ్ ఎకోవరల్డ్ ఆఫీసులో పనిచేస్తున్న ఇద్దరు ఎస్ఏపీ ఉద్యోగులకు హెచ్1 ఎన్1 వైరస్ సోకిన నేపథ్యంలో ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా ముందుజాగ్రత్త చర్యలు చేపట్టామని కంపెనీ వివరించింది. తమ సంస్థ కార్యాలయాల్లో విస్తృతమైన శానిటైజేషన్ కార్యక్రమాలు చేపడతామని కంపెనీ తెలిపింది. ఈ నెల 20 నుంచి 28వతేదీ వరకు ఉద్యోగులందరూ వర్క్ ఫ్రం హోం చేసేందుకు అనుమతిస్తున్నామని కంపెనీ వెల్లడించింది. తమ సంస్థ ఉద్యోగులు లేదా కుటుంబసభ్యులకు ఎవరికైనా జలుబు, దగ్గు, జ్వరం వస్తే వైద్యచికిత్స తీసుకోవాలని కంపెనీ సూచించింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/