మునుగోడు ప్రచారానికి వెళ్లడం ఫై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి క్లారిటీ

మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి వెళ్లేదేలేదని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్లారిటీ ఇచ్చారు. దేశ వ్యాప్తంగా మునుగోడు ఉప ఎన్నిక ఫై ఆసక్తి కనపరుస్తున్నారు. ఈ ఎన్నికలను కాంగ్రెస్ , టిఆర్ఎస్ , బిజెపి పార్టీ లు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కాంగ్రెస్ నుండి పాల్వాయి స్రవంతి , బిజెపి నుండి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి , టిఆర్ఎస్ నుండి ప్రభాకర్ రెడ్డి ముఖ్య నేతలుగా బరిలో ఉన్నారు. అలాగే బీఎస్పీ తరఫున ఓ అభ్యర్థి నామినేషన్ వేశారు. ఇండిపెండెంట్ గా కే ఏ పాల్ కూడా బరిలో నిలిచారు. ఇప్పటికే అన్ని పార్టీల నేతలు మునుగోడు లో ఉంటూ ప్రచారం చేస్తున్నారు. ఈ తరుణంలో మునుగోడు ఉప ఎన్నికల ప్రచారానికి వెళ్లడంపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్లారిటీ ఇచ్చారు.

మునుగోడు ఉప ఎన్నికల ప్రచారానికి వెళ్లేదేలేదని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరోసారి స్పష్టం చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. మునుగోడులో తన లాంటి హోమ్ గార్డ్స్‌ ప్రచారం అవసరం లేదని అన్నారు. ఎస్పీ స్థాయి నేతలే అక్కడ ప్రచారానికి వెళ్తారని యెద్దేవా చేశారు. ‘‘వంద కేసులు పెట్టినా సరే సర్కార్‌ను తీసుకొస్తానని ఓ నేత చెప్పాడు. ఆయనే మునుగోడు ఉప ఎన్నికల్లో గెలిపిస్తాడు.. నాతో ఏం పని?. నేనెప్పుడు విదేశాలకు వెళ్లేది.. కేటీఆర్‌ను అడగండి’’ అంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.