సీఎం జగన్ ఢిల్లీ పర్యటన వాయిదా!

ఖరారు కాని కేంద్ర మంత్రుల అపాయింట్‌మెంట్లు

అమరావతి: ఏపీ సీఎం జగన్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న వాయిదా పడింది. ఆయన సోమవారం ఢిల్లీకి వెళ్లాలనుకున్నప్పటికీ… కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ల అపాయింట్‌మెంట్లు ఖరారు కాలేదు. జల వనరుల శాఖ మంత్రి షెకావత్‌ మాత్రమే అపాయింట్‌మెంట్‌ ఇచ్చారు. ఆ ఒక్కరిని కలిసేందుకైనా సీఎం ఢిల్లీ వెళతారని తొలుత ప్రచారం జరిగింది. కానీ, కేంద్ర మంత్రులు ‘బిజీ’గా ఉన్నందున ముఖ్యమంత్రి జగన్‌ తన ఢిల్లీ పర్యటనను వాయిదా వేసుకున్నారంటూ ఆదివారం సాయంత్రం వైసీపీ వర్గాలు వెల్లడించాయి.
అయితే సీఎం జగన్ ఈ నెల 10న ఢిల్లీ వెళ్లే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/