ముగిసిన మునుగోడు నామినేష‌న్ల ఉప సంహ‌ర‌ణ..

munugode nomination Withdrawal complete

మునుగోడు ఉప ఎన్నికలో నామినేషన్ల ఉపసంహరణకు సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు గడువు ముగిసింది. నామినేషన్ల గడువు ముగిసేలోగా 36 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో ఎన్నికల బరిలో 47 మంది నిలిచారు. దేశ వ్యాప్తంగా మునుగోడు ఉప ఎన్నిక ఫై ఆసక్తి కనపరుస్తున్నారు. ఈ ఎన్నికలను కాంగ్రెస్ , టిఆర్ఎస్ , బిజెపి పార్టీ లు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కాంగ్రెస్ నుండి పాల్వాయి స్రవంతి , బిజెపి నుండి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి , టిఆర్ఎస్ నుండి ప్రభాకర్ రెడ్డి ముఖ్య నేతలుగా బరిలో ఉన్నారు. అలాగే బీఎస్పీ తరఫున ఓ అభ్యర్థి నామినేషన్ వేశారు. ఇండిపెండెంట్ గా కే ఏ పాల్ కూడా బరిలో నిలిచారు.

ఇప్పటికే అన్ని పార్టీల నేతలు మునుగోడు లో ఉంటూ ప్రచారం చేస్తున్నారు. ఈ తరుణంలో మునుగోడు ఉప ఎన్నికల నామినేషన్ల ఉప సంహరణ ప్ర‌క్రియ సోమవారం మధ్యాహ్నం తో పూర్త‌య్యింది. మొత్తం 83 మంది అభ్య‌ర్థులు నామినేషన్లు దాఖాలు చేయ‌గా.. అందులో 36 మంది అభ్యర్థులు ఉప సంహరించుకున్నారు. ఉప ఎన్నికల బరిలో ఫైనల్ గా 47 మంది అభ్యర్థులు ఉన్నారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మునుగోడు నుంచి విజయం సాధించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. ఇటీవలే కాంగ్రెస్ పార్టీతో పాటు మునుగోడు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ కారణంగా మునుగోడుకు ఉప ఎన్నిక అనివార్యమైంది.

కాంగ్రెస్ పార్టీని వీడిన రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారు. ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నికలో ఆయన బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు.