బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ములేపుతున్న కాంతార

కాంతార ..కాంతార ..కాంతార ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఈ మూవీ పెను సంచలనం రేపుతోంది. కెజిఎఫ్ తో కన్నడ సినిమా సత్తా ఏంటో తెలియజేయగా..ఇప్పుడు కాంతార తో మరోసారి కన్నడ సినిమాల గురించి అంత మాట్లాడుకుంటున్నారు. కాంతార చిత్రం కన్నడ లో ఏదో ఓ మోస్తరు విజయం సాదిస్తుందని అంత అనుకున్నారు. కానీ ఇప్పుడు అన్ని భాషల్లో రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది.

సెప్టెంబర్ 30వ తేదీన కన్నడ చిత్ర పరిశ్రమంలో విడుదలైన కాంతార సినిమా ఆ తర్వాత మిగతా భాషల్లో విడుదల అయింది. ఇక కన్నడ చిత్ర పరిశ్రమంలోనే ఈ సినిమా 80 కోట్ల వరకు బాక్సాఫీస్ కలెక్షన్స్ అందుకున్నట్లు సమాచారం. ఇప్పుడు ఇండియా మొత్తంలో కూడా ఈజీగా 100 కోట్లు దాటేసి సంచలరీ రికార్డును అందుకుంది. రాబోయే రోజుల్లో ఈ సినిమా 200 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ కూడా అందుకునే ఛాన్స్ ఉన్నట్లుగా సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక ఈ సినిమా బడ్జెట్ మొత్తంగా 18 కోట్ల వరకు అయినట్లు తెలుస్తోంది. ఇక పెట్టిన పెట్టుబడికి అయితే బయర్లు అందరూ కూడా ప్రాఫిట్ లోనే ఉన్నారు.
తెలుగులో ఇప్పటికే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను పూర్తి చేసింది. ఇక హిందీలో కూడా సినిమా 10 కోట్ల టార్గెట్ కు చేరువలో ఉంది.