రాజకీయాలకు నేను దూరం: చిరంజీవి

సోషల్ మీడియా వేదికగా మెగాస్టార్ స్పందన

I stay away from politics:: mega star chiranjeevi
I stay away from politics:: mega star chiranjeevi

సినీ పరిశ్రమ కి సంబంధించిన పలు సమస్యల పై మెగాస్టార్ చిరంజీవి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తో చర్చ జరిపిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ చర్చ పై వస్తున్న కొన్ని నిరాధార, అవాస్తవాల పై మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదిక గా స్పందించారు తెలుగు సినీ పరిశ్రమ మేలుకోసం, థియేటర్ల మనుగడ కోసం,ఆంధ్రప్రదేశ్ సి.ఎం వై స్ జగన్ నుకలిసి చర్చించిన విషయాలని పక్కదోవ పట్టించే విధంగా,ఆ భేటీకి రాజకీయరంగు పులిమి నన్ను రాజ్యసభకు పంపుతున్నట్లు కొన్ని మీడియా సంస్థలు ప్రసారం చేస్తున్నాయి. అవన్నీ పూర్తిగా నిరాధారం. రాజకీయాలకు దూరంగా ఉంటున్న నేను మళ్ళీ రాజకీయాల లోకి, చట్ట సభలకు రావటం జరగదు. దయచేసి ఊహాగానాలని ప్రసారం చేయవద్దు. ఇప్పటితో పుల్ స్టాప్ పెట్టమని కోరుతున్నాను అని మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యానించారు .

జాతీయ వార్తల కోసం: https://www.vaartha.com/news/national/