అయ్యప్ప మకర జ్యోతి దర్శనం

భక్తులతో కిక్కిరిసిన శబరిమలై ఆలయ ప్రాంగణం

Ayyappa Makara Jyoti Darshan
Ayyappa Makara Jyoti Darshan

ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా శబరిమలై లో మకర జ్యోతి దర్శనానికి దేశం నలువైపుల నుంచి భక్తులు తరలివచ్చారు. పొన్నాంబలమేడు నుంచి దర్శనం ఇచ్చిన మకర జ్యోతిని అయ్యప్ప భక్తులు వీక్షించారు. కరోనా మార్గదర్శకాలను పాటిస్తూ.. భక్తులందరికీ.. అధికారులు దర్శనం ఏర్పాట్లు చేశారు. మకర జ్యోతి దర్శనం ఇవ్వడంతో.. 20వ తేదీన ఆలయం మళ్లి మూసివేయనున్నారు.

మకర సంక్రాంతి రోజున జ్యోతి రూపంలో అయ్యప్ప స్వామి దర్శనం ఇస్తాడని భక్తులు నమ్ముతారు. దీంతో జ్యోతి దర్శనం ఇవ్వగానే భక్తులు ఆనంద పరవశానికి లోనయ్యారు. శుక్రవారం సాయంత్రం 6.51 నిమిషాలకు మకర జ్యోతి దర్శనం ఇచ్చిందని దేవస్థానం తెలిపింది. అంతకుముందు స్వామివారి స్వర్ణాభరణాల ఊరేగింపు నిర్వహించారు.

తెలంగాణ వార్తల కోసం: https://www.vaartha.com/telangana/