పవన్ కళ్యాణ్ గెలుపు ఫై నటుడు కమల్ హాసన్ ట్వీట్

ఏపీ ఎన్నికల్లో సత్తా చాటిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫై నటుడు కమల్ హాసన్ ట్వీట్ చేసారు. జూన్ 4న ఫలితాల ప్రకటన రోజే చంద్రబాబు కు శుభాకాంక్షలు తెలిపిన కమల్ హాసన్.. శుక్రవారం ఎక్స్ వేదికగా పవన్ కళ్యాణ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

‘‘ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో అద్భుతమైన విజయాన్ని అందుకున్న పవన్ కళ్యాణ్‌‌తో భావోద్వేగ సంభాషణ అనంతరం నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశాను. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశలు మరియు ఆకాంక్షలకు అనుగుణంగా సేవ చేసే ఈ యాత్రను ప్రారంభించినందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలిపాను. నిన్ను చూసి గర్విస్తున్నాను సోదరా!’’ అని కమల్ హాసన్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. కమల్ హాసన్ ట్వీట్‌కు పవన్ కళ్యాణ్, జనసేన అభిమానులు ధన్యవాదాలు సార్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు దేశవ్యాప్తంగా అన్ని పరిశ్రమల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతీ ఒక్కరు జనసేనాని విజయాన్ని తమ విజయంగా భావిస్తూ అభినందనలు తెలుపుతున్నారు. ఏపీకి సంబంధించి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని స్థానాల్లో జనసేన 100 శాతం విజయం సాధించడం ఓ రికార్డుగా మారింది. జనసేన పోటీచేసిన 21 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంట్ సీట్లలో జనసేన అభ్యర్థులు ఘన విజయం సాధించడం తెలిసిందే.

Had an emotional conversation and conveyed my heartfelt congratulations to Shri @PawanKalyan on his electoral triumph! I wished him the best as he embarks on this journey of serving the hopes and aspirations of the people of Andhra Pradesh.

Proud of you brother!…— Kamal Haasan (@ikamalhaasan) June 7, 2024