మోడీ ప్రమాణస్వీకార ముహూర్తం ఫిక్స్

Details of Prime Minister Modi’s visit to Telangana on the second day..

ముచ్చటగా మూడోసారి మోడీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ మేరకు ప్రమాణ స్వీకర డేట్, టైమ్ ఫిక్స్ చేశారు. జూన్ 9వ తేదీన సాయంత్రం 7.15 గంటలకు మూడోసారి ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మోదీతో పాటు కేంద్ర మంత్రివర్గంలో మరికొందరు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాత్రి 7: 15 గంటలకు ఆ కార్యక్రమం ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎన్డీఏ పక్ష నేతలంతా హాజరుకానున్నారు. ఏపీ నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ వెళ్లే అవకాశం ఉన్నట్లు సమాచారం. అలాగే విదేశీ ప్రముఖులు కూడా హాజరుకానున్నారు.

శుక్రవారం నాడు మధ్యాహ్నం పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో ఎన్డీఏ (నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్) పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఇందులో పార్లమెంటరీ పార్టీ నేతగా మోడీ పేరును రాజ్‌నాథ్ సింగ్ ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనకు కూటమిలోని భాగస్వామ్య పార్టీల నేతలు సమ్మతి తెలిపారు. సమావేశం ముగిసిన తర్వాత నరేంద్ర మోడీ సహా ఎన్డీయే కూటమిలోని నేతలు రాష్ట్రపతి భవన్‌కు చేరుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అయ్యారు. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు విషయమై లేఖను అందజేశారు. దీంతో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము.. మోడీ ని ఆహ్వానించారు. దీంతో జూన్ 9న మోడీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు సిద్ధమయ్యారు.