జూన్-12న చంద్రబాబు ప్రమాణ స్వీకారం ..ఎక్కడో తెలుసా..?

చంద్రబాబు 4 వ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. జూన్-12న బుధవారం ఉదయం 11:27 గంటలకు ఏపీ సీఎం గా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గన్నవరం విమానాశ్రయం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించబోతున్నారు. మొదట మంగళగిరి ఎయిమ్స్ స్థలం బాగుంటుందని భావించినప్పటికీ.. దీని కంటే ఐటీ పార్క్ స్థలం అనువైనదిగా టీడీపీ నేతలు భావించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మోడీ తో పాటు NDA నేతలు , ఇతర పార్టీల సీఎం లు హాజరు కాబోతుండడంతో అలాగే కూటమి శ్రేణులు సైతం పెద్ద ఎత్తున హాజరు కాబోతుండడం తో ఎయిమ్స్ స్థలం సరిపోదని.. ఐటీ పార్క్ వద్ద అయితే బెటర్ అని టీడీపీ క్యాడర్ డిసైడ్ అయ్యింది.

చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్న సభా స్థలాన్ని టీడీపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, టీడీ జనార్దన్, మంతెన సత్యనారాయణ రాజు, పెందుర్తి వెంకటేష్ తదితరులు పరిశీలించారు. తాడేపల్లిలోని పంచాయతీ రాజ్ కమిషనర్ కార్యాలయంలో ఉన్నతాధికారులు, తెలుగుదేశం నేతలు భేటీ అయ్యారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం ఏర్పాట్లుపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎస్ నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌, డీజీపీ, కృష్ణ జిల్లా కలెక్టర్, అచ్చెన్నాయుడు, ఇతర ఉన్నతాధికారులు, నేతలు పాల్గొన్నారు.