ఆ పార్టీ నేతలు పది తరాలకు సరిపడా సంపాదించారు

ఏపీని వైస్సార్సీపీ నేరాంధ్రప్రదేశ్ గా మార్చింది: బొండా ఉమ

అమరావతి : ఏపీ ని వైస్సార్సీపీ నాశనం చేసిందని, నేరాంధ్రప్రదేశ్ గా మార్చిందని టీడీపీ నేత బొండా ఉమ విమర్శించారు. దేశంలో ఎక్కడ ఏ స్కామ్ జరిగినా దాని మూలాలు ఏపీలోనే ఉంటున్నాయని చెప్పారు. గుజరాత్ లో పట్టుబడిన 9 వేల కోట్ల విలువైన హెరాయిన్ మూలాలు కూడా ఏపీలోనే ఉన్నాయని అన్నారు. హెరాయిన్ నిందితుడు సుధాకర్ వైస్సార్సీపీ మద్దతుతోనే మాదకద్రవ్యాల వ్యాపారాన్ని మొదలుపెట్టాడని చెప్పారు.

ఎర్రచందనాన్ని వైస్సార్సీపీ నేతలు ప్రతి రోజు విదేశాలకు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. తిరుమల వేంకటేశ్వరస్వామికి భక్తులు సమర్పించిన తల వెంట్రుకలను కూడా విదేశాలకు ఎగుమతి చేస్తున్నారని మండిపడ్డారు. వెంట్రుకలను తరలిస్తూ ఇటీవలే పక్కరాష్ట్రాల్లో దొరికిపోయారని అన్నారు. జగన్ నాయకత్వంలో వైస్సార్సీపీ నేతలు పది తరాలకు సరిపడా సంపాదించారని చెప్పారు. ప్రత్యేక విమానాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు విదేశాలకు డబ్బు తరలిస్తున్నారని అన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/