త్వ‌ర‌గా కోలుకోవాలి బావ‌.. కెటిఆర్‌ ట్వీట్

హరీశ్‌రావుకు కరోనా పాజిటివ్‌ స్పందించిన కెటిఆర్‌

ktr
ktr

హైదరాబాద్‌: తెలంగాణ ఆర్థికమంత్రి హరీశ్‌రావుకు కరోనా సోకిన విషయం తెలిసిందే. అయితే ఈవిషయంపై పురపాలక, ఐటీ శాఖ మంత్రి కెటిఆర్‌ స్పందించారు.’బావా త్వరగా కోలుకో.. ఇతరులకంటే త్వరగా కోలుకుంటావన్న నమ్మకం నాకుంది’ అని ట్వీట్ చేశారు. కాగా సోమవారం నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధులు కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఆ పరీక్షల్లోనే హరీశ్‌కు పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని ట్వీట్ చేస్తూ… తనను కలిసిన ప్రజాప్రతినిధులు, అధికారులను టెస్ట్ చేయించుకోవలసిందిగా విజ్ఞప్తి చేశారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని తెలిపారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/