‌సిఎం కెసిఆర్‌కు ధన్యావాదాలు తెలిసిన బాలకృష

సాంఘికశాస్త్రం 268వ పేజీలో ఎన్టీఆర్ పాఠ్యాంశం

Balakrishna-cm kcr

హైదరాబాద్‌: టాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ సిఎం కెసిఆర్‌కు ధ‌న్య‌వాదాలు తెలిపారు. దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి య‌న్‌.టి.రామారావు జీవితాన్ని భ‌విష్య‌త్తు త‌రాల‌కు తెలిసేలా ప‌ద‌వ త‌ర‌గ‌తి పాఠ్య‌పుస్త‌కాల్లో ప్ర‌చురించ‌డం ప‌ట్ల కెసిఆర్‌కు బాల‌కృష్ణ ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఫేస్ బుక్ ద్వారా బాల‌కృష్ణ స్పందించారు. పుస్త‌కంలోని పాఠ్యాంశాల‌కు సంబంధించిన పేజీల ఫొటోల‌ను కూడా బాలకృష్ణ షేర్ చేశారు. తన తండ్రి జీవితాన్ని గురించి భవిష్యత్తు తరాలకు తెలియజేసేలా పాఠ్య పుస్తకంలో ప్రచురించడం పట్ల నందమూరి బాలకృష్ణ హర్షం వ్యక్తం చేశారు. కాగా తెలంగాణ పదో తరగతి పాఠ్యపుస్తకాల్లో ఎన్టీఆర్ జీవితం ఆధారంగా ఒక పాఠ్యాంశాన్ని పెట్టించారు. సోషల్ స్టడీస్ లో పేజీ నంబర్ 268లో ఎన్టీఆర్ కు సంబంధించిన కీలక అంశాలను పేర్కొన్నారు. ఎన్టీఆర్ జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో పెట్టడంతో అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

‘క‌ళకి, కళాకారులకి విలువను పెంచిన కధానాయకుడు, తెలుగోడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ పీఠాన్ని కదలించేలా వినిపించిన మహానాయకుడు, ఎన్నో సాహసోపేతమైన ప్రజారంజక నిర్ణయాలతో ప్రజల ముంగిటకే ప్రభుత్వాన్ని తెచ్చిన ప్రజానాయకుడు, మదరాసీయులమనే పేరుని చెరిపి భారతదేశపటంలో తెలుగువాడికి, తెలుగు వేడికి ఒక ప్రత్యేకతని తెచ్చిన తెలుగుజాతి ముద్దు బిడ్డ ,అన్నగారు, మా నాన్నగారు నందమూరి తారక రామారావు గారి గురించి భావి తరాలకి స్ఫూర్తినిచ్చేలా 10వ తరగతి సాంఘిక శాస్త్ర పుస్తకం లో పాఠ్యాంశముగా చేర్చిన తెలంగాణా ప్రభుత్వానికి మరియు తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు కెసిఆర్ గారికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు’ అని అన్నారు నంద‌మూరి బాల‌కృష్ణ‌.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/