సీఎం కేసీఆర్‌ ఇంట తీవ్ర విషాదం

తెలంగాణ సీఎం కేసీఆర్ ఇంట విషాదం నెలకొంది. మంత్రి కేటీఆర్ మామ పాకాల హరినాథరావు (72) గుండెపోటుతో కన్నుమూశారు. మంగళవారం సాయంత్రం గుండెపోటు రావడంతో గచ్చిబౌలిలోని ఏఐజి ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ హరినాథరావు బుధవారం రాత్రి 8:30 గంటలకు మృతి చెందినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

తన మామ హరినాథరావు మృతి చెందిన విషయం తెలుసుకున్న మంత్రి కేటీఆర్ తన భార్య శైలిమ సహా ఇతర కుటుంబ సభ్యులను తీసుకుని హాస్పిటల్ కి వెళ్లినట్లు తెలుస్తోంది. హరినాథరావు పార్థివ దేహాన్ని రాయదుర్గంలోని ఓరియన్ విల్లాస్ లో ఉన్న ఆయన స్వగృహానికి తరలిస్తున్నారు. హరినాథరావు ఇంటికి చేరుకుని కేసీఆర్ నివాళులు అర్పించే అవకాశం ఉంది.