ఈటల స్వగ్రామం కమలాపూర్ లో మోహరించిన పోలీసులు

భూ అక్రమాల ఆరోపణలపై విచారణ ప్రారంభం

ఈటల స్వగ్రామం కమలాపూర్ లో మోహరించిన పోలీసులు
Etela Rajender- TS CM Kcr

Hyderabad: తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ భూఅక్రమాల ఆరోపణల వ్యవహారం తాజాగా సంచలనం అయింది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఇవాళ విచారణ ప్రారంభమైంది. అచ్చంపేట ప్రభుత్వ పాఠశాలకు విజిలెన్స్ అధికారులు చేరుకున్నారు . అక్కడి రైతుల నుండి వారు సమాచారం సేకరిస్తున్నారు. సమగ్ర విచారణ జరిపి సీఎం కేసీఆర్ నివేదిక అందజేయనున్నారు. ఈటల ఆయన అనుచరులు తమ భూములను కబ్జా చేయడంతో పాటు బెదిరింపులకు కూడా పాల్పడ్డారని కొందరు రైతులు, గ్రామస్థులు ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేటకు ఈటల రాజేందర్ అభిమానులు, టీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా చేరుకోవడంతో పోలీసులు చేరుకున్నారు. మంత్రి ఈటల రాజేందర్‌ స్వగ్రామం కమలాపూర్‌లో గస్తీని ముమ్మరం చేశారు. ఈటల రాజేందర్ అభిమానులు ఆందోళనలో ఉన్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/