భీమ్లా నాయక్ రానా టీజర్ టాక్ : నీ మొగుడు గబ్బర్ సింగ్ అంట కదా..? నేను ‘డేనియల్ ‘ హీరో

భీమ్లా నాయక్ రానా టీజర్ టాక్ : నీ మొగుడు గబ్బర్ సింగ్ అంట కదా..? నేను 'డేనియల్ ' హీరో

నీ మొగుడు గబ్బర్ సింగ్ అంట కదా? స్టేషన్‌లో టాక్.. నేను ధర్మేంద్ర.. హీరో.. డేనియల్ శేఖర్ ఎంటర్టైన్మెంట్.. ప్రొడక్షన్ నెంబర్ వన్ అంటూ రానా పాత్రకు సంబంధించిన వీడియోను రిలీజ్ చేసారు భీమ్లా నాయక్ చిత్ర యూనిట్.

పవన్ కళ్యాణ్ – రానా కలయికలో సాగర్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న మూవీ భీమ్లా నాయక్. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం తాలూకా ప్రమోషన్ ను స్పీడ్ చేస్తూ సినిమా ఫై అంచనాలు పెంచుతున్నారు. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు నాడు భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ రిలీజ్ చేసి అంచనాలు పెంచగా..ఈరోజు రానా తాలూకా టీజర్ ను రిలీజ్ చేసి ఆసక్తి పెంచారు.

నీ మొగుడు గబ్బర్ సింగ్ అంట కదా? స్టేషన్‌లో టాక్.. నేను ధర్మేంద్ర.. హీరో.. డేనియల్ శేఖర్ ఎంటర్టైన్మెంట్.. ప్రొడక్షన్ నెంబర్ వన్ అంటూ రానా పాత్రకు సంబంధించిన వీడియోను విడుదల చేసి రానా రోల్ ను చెప్పకనే చెప్పారు. ఈ చిత్రానికి స్క్రిప్ట్‌ను త్రివిక్రమ్ అందిస్తుండగా.. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో నిత్యా మీనన్ హీరోయిన్‌గా నటిస్తుంది. 2022 జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.