17వ రోజుకు చేరుకున్న రాజధాని రైతుల మహాపాదయాత్ర

నేడు 16 కిలోమీటర్ల పాటు సాగి ప్రకాశం జిల్లా గుడ్లూరుకు చేరుకోనున్న యాత్ర

అమరావతి: ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ ‘న్యాయస్థానం నుంచి దేవస్థానం’ పేరుతో రాజధాని రైతులు చేపట్టిన మహాపాదయాత్ర నేడు 17వ రోజుకు చేరుకుంది. ప్రకాశం జిల్లా కందుకూరులోని వెంగమాంబ కల్యాణ మండపం నుంచి ఈ ఉదయం ప్రారంభమైన యాత్ర 16 కిలోమీటర్ల పాటు సాగనుంది. మధ్యాహ్నం మోపాడులో రైతులు భోజనం చేస్తారు. రాత్రికి ప్రకాశం జిల్లా గుడ్లూరులో రైతులు బస చేస్తారు. మొత్తం 45 రోజులపాటు సాగనున్న ఈ పాదయాత్రలో భాగంగా గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని 70 ప్రధాన గ్రామాల మీదుగా సాగుతుంది. డిసెంబరు 15న తిరుపతికి చేరుకోవడంతో పాదయాత్ర ముగుస్తుంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/